Begin typing your search above and press return to search.

ఇద్దరు స్టార్స్ తో ఇలాంటి సినిమానా అనుకున్నారు.. కానీ..?

2013 లో వెంకటేష్ పెద్దోడుగా.. మహేష్ చిన్నోడుగా కలిసి నటించిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. వెంకటేష్, మహేష్ మల్టీస్టారర్ అనగానే అంచనాలు తారాస్థాయికి చేరాయి.

By:  Tupaki Desk   |   11 Jan 2025 4:30 PM GMT
ఇద్దరు స్టార్స్ తో ఇలాంటి సినిమానా అనుకున్నారు.. కానీ..?
X

ఇప్పుడు మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగించేందుకు అందరు స్టార్స్ ముందుకొస్తున్నారు. ఐతే దానికి నాంధి పలికింది మాత్రం ఇద్దరు స్టార్స్ అని చెప్పొచ్చు. 12 సంవత్సరాలు క్రితం ఆ ఇద్దరు స్టార్స్ ఒక మల్టీస్టారర్ చేయడం వల్ల ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మరికొంతమంది అలా మల్టీస్టారర్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఎవరా ఆ ఇద్దరు హీరోలు అంటే సూపర్ స్టార్ మహేష్, విక్టరీ వెంకటేష్ అని తెలుస్తుంది.

2013 లో వెంకటేష్ పెద్దోడుగా.. మహేష్ చిన్నోడుగా కలిసి నటించిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. వెంకటేష్, మహేష్ మల్టీస్టారర్ అనగానే అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఐతే ఇద్దరితో కలిసి ఒక మాస్ సినిమా చేస్తాడేమో అనుకుంటే శ్రీకాంత్ అడ్డాల అందరి అంచనాలకు రివర్స్ లో ఒక క్లాస్ ఎంటర్టైనర్ చేశాడు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చూసిన మాస్ ఆడియన్స్ కి పెద్దగా ఎక్కక్క పోవచ్చు కానీ పెద్దోడు చిన్నోడుగా వెంకటేష్, మహేష్ న్యాచురల్ యాక్టింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు ఆ ఇద్దరి హీరోల మాస్ ఇమేజ్ కన్నా పాత్రలో వాళ్లు ఒదిగిపోయిన తీరు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఇక మరోపక్క రేలంగి మామయ్యగా ప్రకాష్ రాజ్ పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది.

ఒక మంచి కుటుంబ కథా చిత్రంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నిలిచింది. ఈ సినిమా ఎప్పుడు చూసినా సరే బోర్ కొట్టదు. ఈ సినిమా 2013 జనవరి 11న రిలీజైంది. అంటే సరిపోగ్గా 11 ఏళ్ల క్రితం ఈ సినిమా వచ్చిందన్నమాట. సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. ఆ సినిమాలో నటించిన మహేష్, వెంకటేష్ ఇప్పుడు కూడా ఎక్కడ కలిసినా పెద్దోడు చిన్నోడు అనుకుంటూ ఉంటారంటే ఆ సినిమాతో ఏర్పడిన అనుబంధం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఐతే మహేష్ మిస్ అయ్యాడు కానీ సంక్రాంతికి వెంకటేష్ మాత్రం ఏదో ఒక సినిమాతో వస్తున్నాడు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి సైంధవ్ సినిమాతో వచ్చి నిరాశ పరచిన వెంకటేష్ ఈసారికి సంక్రాంతికి వస్తున్నాం తోనే వస్తున్నాడు. ఈ సినిమా కూడా దిల్ రాజు నిర్మించడమే విశేషం.