Begin typing your search above and press return to search.

ఇట్స్ మూవీస్ టైమ్.. రేపు ఒక్కరోజే అన్ని సినిమాలా!

ఎన్నికలు.. ఐపీఎల్.. ఈ రెండింటి వల్ల కొన్ని రోజులుగా సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోయాయి

By:  Tupaki Desk   |   6 Jun 2024 1:16 PM GMT
ఇట్స్ మూవీస్ టైమ్.. రేపు ఒక్కరోజే అన్ని సినిమాలా!
X

ఎన్నికలు.. ఐపీఎల్.. ఈ రెండింటి వల్ల కొన్ని రోజులుగా సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోయాయి. వేసవి అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ సహా అంతా పూర్తవడంతో వరుస సినిమాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. గత వారం విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కార్తికేయ భజే వాయువేగంతో పాటు ఆనంద్ దేవరకొండ గం గం గణేశా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ వారం కూడా పలు చిత్రాలు రిలీజ్ కానున్నాయి. నాలుగు తెలుగు సినిమాలు సహా మొత్తం 11 చిత్రాలు విడుదలవుతున్నాయి. రెండేళ్ల గ్యాప్ తర్వాత మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు శర్వానంద్. కృతి శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ మూవీని శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించారు. ఫీల్ గుడ్ రిలేషన్‍ షిప్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అవుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటించిన ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ కూడా రేపు రిలీజ్ కానుంది. సుమన్ చిక్కాల డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీతో మంచి హిట్ కొట్టాలని కాజల్ చూస్తోంది. క్రైమ్ లవర్స్ ను టార్గెట్ చేసుకుని తీసిన ఈ చిత్రం.. లేడీస్ నుంచి మాసివ్ రెస్పాన్స్ అందుకుంటుందని మేకర్స్ హోప్స్ తో ఉన్నారు.

ఇక యాక్టర్ నవదీప్.. లాంగ్ గ్యాప్ తర్వాత హీరోగా నటించిన లవ్ మౌళి.. జూన్ 7వ తేదీన విడుదల అవ్వనుంది. రొమాన్స్ ఇంటెన్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. యూత్ ను ఆకట్టుకునేలా మూవీ తీసినట్లు సమాచారం. మూవీలో 42 కిస్ సీన్స్ ఉంటాయని ఇప్పటికే టాక్ వినిపించింది. దీంతో యువత మూవీని హిట్ చేస్తారన్న అంచనాలు మేకర్స్ లో గట్టిగా ఉన్నాయి.

మరోవైపు, ఇటీవల వివాదంలో చిక్కుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ రక్షణ మూవీ ఎట్టకేలకు రేపు రిలీజ్ అవుతోంది. ఆడియన్స్ లో అంత బజ్ లేకపోయినా సినిమా రిజల్ట్.. టాక్ పై డిపెండ్ అయ్యి ఉంది. వీటితోపాటు తమిళ డబ్బింగ్ మూవీ సత్యరాజ్ వెపన్ విడుదల కానుంది. నమో, గోల్డ్ నెంబర్ వన్, ఓసి, ప్రేమించొద్దు, చోటా భీమ్ అండ్ కర్స్ ఆఫ్ ద్యాన్ సహా పలు చిత్రాలు రిలీజ్ కానున్నాయి. మరి ఏ సినిమా ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.