Begin typing your search above and press return to search.

ఒరిజిన‌ల్ కంటెంట్‌తో వ‌స్తున్న‌ ఏకైక హిందీ న‌టుడు!

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా కొంద‌రి ప్ర‌తిభ ఆక‌ర్షిస్తుంది. అలాంటి ఒక గొప్ప ప్ర‌తిభావంతుడైన‌ న‌టుడు ద‌ర్శ‌కుడు ఫ‌ర్హాన్ అక్త‌ర్.

By:  Tupaki Desk   |   26 Jan 2025 11:30 PM GMT
ఒరిజిన‌ల్ కంటెంట్‌తో వ‌స్తున్న‌ ఏకైక హిందీ న‌టుడు!
X

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా కొంద‌రి ప్ర‌తిభ ఆక‌ర్షిస్తుంది. అలాంటి ఒక గొప్ప ప్ర‌తిభావంతుడైన‌ న‌టుడు ద‌ర్శ‌కుడు ఫ‌ర్హాన్ అక్త‌ర్. షారూఖ్ `డాన్` ఫ్రాంఛైజీ ద‌ర్శ‌కుడిగా అత‌డంటే ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌త్యేక గౌర‌వం ఉంది. దిల్ చ‌హ‌తా హై లాంటి గొప్ప సినిమాకి అత‌డు ద‌ర్శ‌కుడు. అలాగే భాగ్ మిల్కా భాగ్ లో అత‌డి న‌ట‌న, మేకోవ‌ర్ ప‌డిన శ్ర‌మ గురించి చాలా చ‌ర్చించుకున్నారు.

ఇప్పుడు అత‌డు న‌టిస్తున్న `120 బహదూర్` కోసం ఎంత‌దాకా అయినా వెళ్లేందుకు అత‌డు సిద్ధ‌మ‌వుతున్నాడు. 1962 ఇండో-చైనా యుద్ధంలో భారతీయ సైనికుల కఠినమైన సవాళ్ల‌తో కూడిన జీవితాలను అత‌డు సాహ‌సోపేతంగా తెర‌కెక్కిస్తున్నాడు. దానికోసం ఒరిజిన‌ల్ లైవ్ లొకేష‌న్ల‌లో చిత్రీక‌రించాల‌నే ప‌ట్టుద‌ల‌ను క‌న‌బ‌రుస్తున్నాడు. ప్రస్తుతం జైపూర్‌లో షూటింగ్ కోసం అత‌డు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం దేశభక్తి నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని చెబుతున్నారు. ఇందులో క‌ట్టిప‌డేసే న‌ట‌న‌కు ఫ‌ర్హాన్ కి చాలా స్కోప్ దొరికింది. వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలో అత‌డు ఎమోష‌న‌ల్ పెర్ఫామెన్స్ తో మైమ‌రిపిస్తాడు. ఇంత‌కుముందు విడుద‌లైన టీజ‌ర్ గ‌గుర్పాటుకు గురి చేసింది. మంచు కొండ‌ల్లో గ‌డ్డ‌క‌ట్టే మైన‌స్ డిగ్రీల చ‌లిలో సైనికుల క‌ష్టాలు ఎలా ఉంటాయో క‌ళ్ల‌కు క‌ట్టాడు ఫ‌ర్హాన్. టీజ‌ర్ వేగంగా వెబ్ లో దూసుకెళ్లింది. ట్రైల‌ర్ తో ఈ హీట్ ని మ‌రింత పెంచే అవ‌కాశం ఉంది. న‌టుడిగా ఎలాంటి సినిమా చేస్తే కంబ్యాక్ సాధ్య‌మో అలాంటి సినిమా చేస్తున్నాడ‌న్న భ‌రోసా క‌నిపిస్తోంది.

ఫ‌ర్హాన్ న‌టించిన సినిమా విడుద‌లై చాలా కాల‌మే అయింది. అత‌డి చివ‌రి చిత్రం తూఫాన్ డిజిట‌ల్ గా విడుద‌లై అంత‌గా ఆక‌ర్షించ‌లేక‌పోయింది. అత‌డు స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించే సినిమా కోసం కూడా అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. త‌దుప‌రి ద‌ర్శ‌కుడిగా ర‌ణ‌వీర్ తో `డాన్ 3`ని తెర‌కెక్కించాల్సి ఉంది. 120 బ‌హ‌దూర్ తో న‌టుడిగాను స‌త్తా చాటాల్సి ఉంది. బాలీవుడ్ లో ఒరిజిన‌ల్ కంటెంట్ లేదు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఫ‌ర్హాన్ ప్ర‌య‌త్నాన్ని హ‌ర్షించాలి.