ట్వెల్త్ ఫెయిల్ ఎలా ఉంది.. టాక్ ఏంటి..?
ఈ సినిమాలో మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మాస్సే నటించగా డి.ఎస్.పి దుష్యంత్ పాత్రలో ప్రియాన్షు చటర్జీ నటించారు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
By: Tupaki Desk | 4 Jan 2024 3:09 PM GMTరియల్ ఇన్సిడెంట్స్ తో చేసే సినిమాలు చేయడంలో బాలీవుడ్ మేకర్స్ కి ఒక సెపరేట్ స్టైల్ ఉంటుంది. ఇప్పటికే అదే తరహాలో ఎన్నో సినిమాలు రాగా అవి ప్రేక్షకాదరణ పొందాయి. లేటెస్ట్ గా ఐ.పి.ఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలతో ఒక సినిమా తెరకెక్కింది. అదే ట్వెల్త్ ఫెయిల్. ఈ సినిమాలో మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మాస్సే నటించగా డి.ఎస్.పి దుష్యంత్ పాత్రలో ప్రియాన్షు చటర్జీ నటించారు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
చంబల్ లో పేద కుటుంబంలో జన్మించిన మనోజ్ కుమార్ శర్మ (విక్రాంత్ మాస్సే) నిజాయితీగా పనిచేస్తున్న తండ్రి సస్పెండ్ అవుతాడు. మనోజ్ స్కూల్ లో పరీక్షల టైం మాల్ ప్రాక్టీస్ లో పాల్గొనమని ప్రిన్సిపాల్ ప్రోత్సహించడం చూసి డి.ఎస్.పి దుష్యంత్ హెడ్ మాస్టర్ ని అరెస్ట్ చేస్తాడు. ఆ టైం లో డి.ఎస్.పి నిజాయితీగా ఉండటం గురించి మనోజ్ కి చెప్పడంతో అతని మాటలకు స్పూర్తి పొందుతాడు మనోజ్. ఆ టైం లో నిజాయితీ గల అధికారిగా మారి సమానంలో మార్పు తీసుకురావాలని అనుకుంటాడు. ఈ ప్రయాణంలో మనోజ్ ఎలా సక్సెస్ అయ్యాడు.. అతను ఎలాంటి కష్టాలు పడ్డాడు అన్నది ట్వెల్త్ ఫెయిల్ కథ.
ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి తాను అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు ఎలా కష్టపడ్డాడు అనే కథలు ఇప్పటివరకు చాలానే చూశాం. కానీ ఆ కథను చెప్పే విధానంలోనే ప్రేక్షకులను మెప్పించాల్సి ఉంటుంది. ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే రాయడం అంత తేలికైన విషయం కాదు. స్క్రీన్ ప్లే ఆడియన్స్ ని ఆకట్టుకునేలా రాయడంలో విధు వినోద్ చోప్రా సక్సెస్ అయ్యారు.
మనోజ్ కుమార్ శర్మగా విక్రాంత్ మాస్సే బాగా చేశారు. ఈ సినిమాకు అతని నటనే ప్లస్ పాయింట్. నటీనటుల ప్రతిభ ఈ సినిమాకు ప్లస్ గా మారింది. క్లైమాక్స్ ఇంటర్వ్యూ సీన్ సినిమాకు మరో హైలెట్ గా నిలిచేలా చేశారు. సినిమాలో నటించిన అనంత్ విజయ్ జోష్, సరితా జోషి, అన్షుమాన్ పుష్కర్, వికాస్ దివ్య కీర్తి కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. కథనం బాగానే ఉన్నా అక్కడక్కడ కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. లీడ్ పెయిర్ మధ్య సీన్స్ ఇంకాస్త బెటర్ గా రాసే అవకాశం ఉంది. కమర్షియల్ అంశాలు కాస్త లోపించినట్టు అనిపించినా ఫైనల్ గా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.