Begin typing your search above and press return to search.

పుష్ప 2 ఖాతాలో మరో పవర్ఫుల్ రికార్డ్!

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ నుంచి వచ్చిన చిత్రాలలో అత్యధిక టికెట్లు సోల్డ్ అయిన చిత్రంగా ఈ మూవీ ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.

By:  Tupaki Desk   |   14 Dec 2024 11:23 AM GMT
పుష్ప 2 ఖాతాలో మరో పవర్ఫుల్ రికార్డ్!
X

‘పుష్ప 2’ మూవీ వరల్డ్ వైడ్ గా అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే 1067 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకున్న ఈ చిత్రం ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలు తగ్గడంతో మరల ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో శని, ఆదివారాల్లో మరల మూవీ వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇక ఓవర్సీస్ మార్కెట్ తో పాటు నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమా సునామీ సృష్టిస్తోంది.

ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. తాజాగా తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో బన్నీ అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్ ని దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ ఖండించారు. ప్రతి ఒక్కరు బన్నీకి సపోర్ట్ గా నిలబడ్డారు. ఇదిలా ఉంటే రెండో వారం థియేటర్స్ లో ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.

ఈ రెండు రోజుల్లో 1200 కోట్ల కలెక్షన్స్ ని ‘పుష్ప 2’ క్రాస్ చేస్తుందని అనుకుంటున్నారు. సినిమా మరో రికార్డ్ ని తన ఖాతాలో వేసుకుంది. కేవలం తొమ్మిది రోజుల్లోనే బుక్ మై షో ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 13.3 మిలియన్స్ టికెట్లు అమ్ముడయ్యాయంట. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ నుంచి వచ్చిన చిత్రాలలో అత్యధిక టికెట్లు సోల్డ్ అయిన చిత్రంగా ఈ మూవీ ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.

మొన్నటి వరకు ఈ రికార్డ్ ‘కల్కి 2898ఏడీ’ పేరు మీద ఉండేది. అయితే దీనిని ‘పుష్ప 2’ కేవలం 9 రోజుల్లోనే బ్రేక్ చేసిందని తాజాగా ప్రకటించారు. ఇది నిజంగా రేర్ ఫీట్ అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత మన ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగాయని ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. ఒకప్పుడు 100 కోట్ల కలెక్షన్స్ చాల గొప్పగా చెప్పుకునేవారు.

అయితే ఇప్పుడు ‘పుష్ప 2’ కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక కంటెంట్ స్టాండర్డ్స్ ని మరింతగా పెంచి ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్ కథలు తెరకెక్కిస్తే 2000 కోట్ల కలెక్షన్స్ ని కూడా ఇండియన్ సినిమాలు సునాయాసంగా అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ తెలుగులో రాబోయే ‘కల్కి 2898ఏడీ’, ‘SSMB29’, ‘సలార్ 2’, ‘స్పిరిట్’ సినిమాలు 2000 కోట్ల కలెక్షన్స్ కోసం పోటీ పడతాయని అనుకుంటున్నారు.