Begin typing your search above and press return to search.

12 రోజులు 1300కోట్లు.. ఆగస్ట్ బాక్సాఫీస్ షేక్

ఈ ఏడాది ఆగస్ట్ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. భారీ వసూళ్లను అందించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

By:  Tupaki Desk   |   21 Aug 2023 2:44 PM GMT
12 రోజులు 1300కోట్లు..  ఆగస్ట్ బాక్సాఫీస్ షేక్
X

ఈ ఏడాది ఆగస్ట్ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. భారీ వసూళ్లను అందించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండిపెండెన్స్ డే సందర్భగా రిలీజైన చిత్రాల్లో భోళాశంకర్ మినహా.. జైలర్, గదర్ 2, ఓమై గాడ్ 2 చిత్రాలు ఈ రికార్డ్ వసూళ్లను అందుకున్నాయి.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్​లోనే అతి పెద్ద భారీ బ్లాస్ బస్టర్ హిట్​గా నిలిచింది 'జైలర్' మూవీ. ఆగస్టు 10న రిలీజైన ఈ చిత్రం.. మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ క్రమంలోనే కమల్​ హసన్ 'విక్రమ్' సినిమా రూ.400 కలెక్షన్లను.. ​ ఆరు రోజుల్లోనే అధిగమించి అదరగొట్టింది. వరల్డ్ వైడ్ గా 12 రోజుల్లో రూ. 550 కోట్లు వసులు చేసింది.

దేశభక్తి నేపథ్యంలో సన్నీ దేఓల్ హీరోగా తెరకెక్కిన సినిమా 'గదర్ 2'. 20ఏళ్ల కిందట రిలీజై సూపర్​ హిట్​గా నిలిచిన 'గదర్ - ఏక్ ప్రేమ్ కథా' సినిమాకు సీక్వెల్​గా వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కూడా మొదటి రోజు నుంచి మంచి వసూళ్లను అందుకుంటూ.. మొత్తం 12రోజుల్లో రూ. 480 కోట్లు రాబట్టింది.

వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం 'ఓ మై గాడ్ 2'. దర్శకుడు అమిత్ రాయ్ దర్శకుడు. ఈ చిత్రంతోనే చాలా రోజుల తర్వాత మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు అక్షయ్. ఆగస్టు 11న రిలీజైన ఈ సినిమా కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. పన్నెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 165 కోట్ల వరకు వసుళ్లను సాధించింది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్'.. ఆగస్టు 11న గ్రాండ్​గా రిలీజై భారీ డిజాస్టర్ అందుకుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 45 కోట్ల కలెక్షన్లు మాత్రమే అందుకుని చిరు కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. మొత్తంగా ఈ నాలుగు చిత్రాలు కలిపి ఆగస్ట్ నెలలో కేవలం 12 రోజుల్లో రూ.1300కోట్లను అందుకున్నాయి.

ఇక రాబోయే సెప్టెంబర్ , అక్టోబర్ లోనూ బాక్సాఫీస్ ముందు భారీ వసూళ్లు వచ్చే అవకాశముంది. విజయ్ దేవరకొండ ఖుషి, షారుక్ ఖాన్ జవాన్, రామ్ స్కంద, ప్రభాస్ సలార్, బాలకృష్ణ భగవంత్ కేసరి, విజయ్ లియో, రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్నాయి. మరి ఈ చిత్రాలు రాబోయే రెండు నెలల్లో ఎలాంటి వసూళ్లను సాధిస్తాయో ఆసక్తికరంగా మారింది.