Begin typing your search above and press return to search.

2025 టాలీవుడ్.. సమ్మర్ ఎలా ఉంటుందంటే..

2025 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ తో రానున్నారు.

By:  Tupaki Desk   |   28 Sep 2024 11:15 AM GMT
2025 టాలీవుడ్.. సమ్మర్ ఎలా ఉంటుందంటే..
X

ప్రేక్షకులని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసి థియేటర్స్ కి రప్పించాలంటే పర్టిక్యులర్ గా కొన్ని సీజన్స్ లలోనే సాధ్యం అవుతుంది. అందుకే ఆ సీజన్స్ లలో స్టార్ హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రావడానికి ఆసక్తి చూపిస్తారు. అందులో భాగంగానే వచ్చే ఏడాదికి ఇప్పటి నుంచి మన హీరోలు తమ సినిమాల రిలీజ్ ప్లాన్ ని షెడ్యూల్ చేసేసుకున్నారు. 2025 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ తో రానున్నారు.

అలాగే విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో రెడీ అవుతున్నారు. మరోవైపు బాలయ్య ‘NBK109’ సినిమాతో సిద్ధం కాబోతున్నారు. మరికొందరు హీరోలు కూడా సంక్రాంతి రేసులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆల్ మోస్ట్ సంక్రాంతి సీజన్ స్టార్ హీరోల సినిమాలతో హౌస్ ఫుల్ అయిపొయింది. నెక్స్ట్ మంచి సీజన్ అంటే సమ్మర్ అని చెప్పాలి. సమ్మర్ ఆరంభంలో స్కూల్స్, కాలేజీలకి సెలవులు మొదలవుతాయి. దీంతో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగానే ఆసక్తి చూపిస్తారు.

అందుకే మార్చి నుంచి మే ఆరంభం వరకు సినిమా రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటారు. 2025 ఈ సమ్మర్ సీజన్ లో పోటీకి అప్పుడే నలుగురు స్టార్ హీరోలు సిద్ధమైపోయారు. అందులో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ ను మార్చి 28కి ఫిక్స్ చేశారు. మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘హరిహర వీరమల్లు’ ఉంది. దీని తర్వాత రెండు వారాల గ్యాప్ లో ప్రభాస్, మారుతి కాంబోనేషన్ లో సిద్ధం అవుతోన్న ‘ది రాజాసాబ్’ మూవీ రిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ 10న ‘ది రాజాసాబ్’ రిలీజ్ కానుంది.

నెక్స్ట్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా పోటీలో ఉన్నాడు. అతని ‘VD12’ మూవీ రిలీజ్ ను మార్చి 28గా ఫిక్స్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కి పోటీగా ఈ సినిమాని సితార వాళ్ళు రిలీజ్ చేయకపోవచ్చు. కానీ మే లోపు అయితే ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందని టాక్. నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’ మూవీ కూడా సమ్మర్ కే సిద్ధమవుతోంది. ఈ సినిమాని మే 1 రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు.

ఇవి కాకుండా రాకింగ్ స్టార్ యష్ ‘టాక్సిక్’ మూవీని ఏప్రిల్ 10న ఫిక్స్ చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా తెరకెక్కుతోన్న ‘కుభేర’ మూవీ సమ్మర్ సీజన్ లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అన్నటున్నారు. అలాగే బాలయ్య ‘NBK109’ చిత్రం సంక్రాంతి రిలీజ్ కుదరకపోతే సమ్మర్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కన చూస్తుంటే 2025 సంక్రాంతి సీజన్ లో పెద్ద సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ కావడం ఖాయం అని తెలుస్తోంది.