2025 పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే..!
నాలుగేళ్లుగా చేస్తున్న హరి హర వీరమల్లు సినిమా మొదటి భాగం ఆల్రెడీ మార్చిలో రిలీజ్ షెడ్యూల్ చేశారు.
By: Tupaki Desk | 25 Dec 2024 6:30 AM GMTబ్రో సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయడానికి 3 సినిమాలు సైన్ చేశాడు కానీ వాటిలో ఏది పూర్తి చేయలేదు. ఏపీలో రాజకీయాల పరంగా ఫుల్ బిజీ అయ్యాడు పవన్ కళ్యాణ్. దాని వల్ల 2024 లో ఫ్యాన్స్ కి ఒక్క సినిమా కూడా అందించలేకపోయాడు. ఐతే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి 2025 స్పెషల్ కానుందని తెలుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ పవర్ స్టార్ నుంచి రెండు సినిమాలు వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి. నాలుగేళ్లుగా చేస్తున్న హరి హర వీరమల్లు సినిమా మొదటి భాగం ఆల్రెడీ మార్చిలో రిలీజ్ షెడ్యూల్ చేశారు.
వీరమల్లు సినిమాను సాధ్యమైనంత వరకు త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు పవర్ స్టార్. అందుకే తను మొదటి ప్రిఫరెన్స్ అదే అన్నట్టుగా డేట్స్ ఇస్తున్నారు. ఆ సినిమా తో పాటు సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమాను కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు. వీరమల్లు సినిమా పూర్తి కాగానే ఓజీకి డేట్స్ అడ్జెస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఐతే వీరమల్లు సినిమా నెక్స్ట్ మార్చి కి రిలీజ్ లాక్ చేయగా.. ఓజీ కూడా నెక్స్ట్ సమ్మర్ లేదా సెకండ్ హాఫ్ రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.
సో ఈ లెక్కన నెక్స్ట్ ఇయర్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి రెండు సినిమాలు కానుకగా ఇవ్వనున్నారు. పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా పీరియాడికల్ కథతో రాబోతుంది. ఐతే ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ మొదట ప్రారంభించి ఎక్కువ శాతం షూట్ చేయగా చివర్లో జ్యోతి కృష్ణ వచ్చి దాన్ని పూర్తి చేస్తున్నారు. వీరమల్లు సినిమా రెండు భాగాలుగా వస్తుంది. ఐతే పాత్ర కనెక్ట్ అయితే ఈ సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.
మరోపక్క సాహో సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ పై పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించిన సుజిత్ సినిమాతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరినీ కాలర్ ఎగరవేసేలా చేయాలని చూస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బొమ్మ హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ సినిమా రేంజ్ ఏంటన్నది అందరికీ తెలిసిందే. మరి సుజిత్ ఏం చేస్తాడో అని పీ.కే ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.