చిన్న కథతో ప్రీమియర్స్ డేర్
ఈ మధ్యకాలంలో రిలీజ్ కి ముందు సినిమాలకి స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు.
By: Tupaki Desk | 1 Sep 2024 3:19 PM GMTఈ మధ్యకాలంలో రిలీజ్ కి ముందు సినిమాలకి స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. సినిమా కంటెంట్ పై కాన్ఫిడెన్స్ ఉన్న వారు ఇలా పెయిడ్ ప్రీమియర్స్ వేయడానికి ముందుకొస్తున్నారు. ఇలా డేర్ తో రిలీజ్ అయిన సినిమాలకి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ పెయిడ్ ప్రీమియర్స్ కారణంగా పబ్లిక్ లోకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ముందుగానే వెళ్లడం వలన సినిమాకి అదనపు అడ్వాంటేజ్ అవుతోంది. కంటెంట్ ఉన్న చిత్రాలకి ఇలాంటి పెయిడ్ ప్రీమియర్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి.
గతంలో మేజర్, చార్లీ777, హనుమాన్ సినిమాలకి స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. అయితే మిస్టర్ బచ్చన్ సినిమాకి పెయిడ్ ప్రీమియర్స్ వేసిన అది వర్క్ అవుట్ కాలేదు. కంటెంట్ బాగుంటే సినిమాకి ఆటోమేటిక్ గా ఆదరణ వస్తుంది. అయితే పోటీలో ఎక్కువ సినిమాలు ఉన్నప్పుడు ఈ పెయిడ్ ప్రీమియర్ షోలు కచ్చితంగా పబ్లిక్ లోకి మౌత్ టాక్ ని పంపించడానికి ఉపయోగపడుతుంది.
ఈ నేపథ్యంలో సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన చిన్న సినిమా 35 చిన్న కథ కాదు చిత్రానికి పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని డిసైడ్ అయ్యారంట. సెప్టెంబర్ 4, 5 తేదీలలో ఎంపిక చేసిన థియేటర్స్ లలో ఈ పెయిడ్ ప్రీమియర్స్ ఈ సినిమాకి వేయబోతున్నారంట. కచ్చితంగా ఈ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కంటెంట్ బేస్డ్ కథలతో తెరకెక్కే చిన్న సినిమాలకి ఎక్కువ ఆదరణ లభిస్తోంది.
ఆగష్టులో కమిటీ కుర్రోళ్ళు, ఆయ్, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం చిన్న సినిమాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి. వాటి తరహాలోనే 35 చిన్న కథ కాదు కూడా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. నివేదా థామస్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమాకి ట్రైలర్ కి ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే పెయిడ్ ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
దీనికి ఒక రోజు ముందు ఇళయదళపతి విజయ్ GOAT చిత్రం థియేటర్స్ లోకి రానుంది. సెప్టెంబర్ 7న రాజ్ తరుణ్ భలే ఉన్నాడే, సుహాస్ జనక అయితే గనక సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ పోటీని తట్టుకొని బడ్జెట్ పరంగా చిన్న చిత్రంగా వస్తోన్న '35 చిన్న కథ కాదు' ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది చూడాలి.