Begin typing your search above and press return to search.

రానా '35- చిన్న క‌థ కాదు' మూవీ.. ట్రైల‌ర్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి నిర్మిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా మూవీ 35- చిన్న కథ కాదు.

By:  Tupaki Desk   |   1 Sep 2024 6:19 AM GMT
రానా 35- చిన్న క‌థ కాదు మూవీ.. ట్రైల‌ర్ ఎలా ఉందంటే?
X

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి నిర్మిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా మూవీ 35- చిన్న కథ కాదు. నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో మలయాళీ బ్యూటీ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా నుంచి వచ్చిన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 6వ తేదీన మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న వేళ.. మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. అందులో భాగంగా మూవీ ట్రైలర్ ను టాలీవుడ్ కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదల చేశారు. దర్శనానికి ఒకటి.. రూమ్లకు రెండు.. ప్రసాదాలకు మూడు.. డైలాగ్ తో కామెడీగా ట్రైలర్ ప్రారంభమైంది. చదువు విషయంలో ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థిని అంతా జీరో బాబు, సున్నా అని స్కూల్ లో పిలుస్తుంటారు. క్లాస్ లో టీచర్లు పనిష్ చేస్తుంటారు. అంతా హేళన చేస్తుంటారు.

దీంతో తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు. ఎలా అయినా కొడుకును ఉన్నత స్థితికి చేర్చాలని తల్లి (నివేదా థామస్) పాటుపడుతుంటుంది. మరి చివరకు ఏమైందనేది మిగతా సినిమాగా తెలుస్తోంది. మిడిల్ క్లాస్ సమస్యలతోపాటు భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమలను కూడా ట్రైలర్ లో యాడ్ చేశారు మేకర్స్. మాకు కావాల్సింది పిల్లలతో బాగా ఉండడం కాదు.. పిల్లలు బాగుపడడం.. అంటూ టీచర్ (ప్రియదర్శి) చెప్పిన డైలాగ్స్ తోపాటు మరిన్ని డైలాగ్స్ అట్రాక్టివ్ గా అనిపిస్తున్నాయి.

ట్రైలర్ ను చూస్తుంటే.. దర్శకుడు నందకిషోర్ స్టోరీని చాలా ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేసినట్లు అర్థమవుతోంది. విశ్వ దేవ్, నివేదా థామస్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ గా అదరగొట్టారు. ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్ తమ రోల్స్ ద్వారా మూవీని మరింత లోతుగా తీసుకెళ్లారు. సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి గ్రామీణ నేపథ్యాన్ని ఎఫెక్టివ్‌ గా షూట్ చేసినట్లు క్లియర్ గా తెలుస్తోంది. వివేక్ సాగర్ అందించిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్.. సినిమాను మరింత అందంగా తీర్చిదిద్దిందనే చెప్పాలి.

సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టేైర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. నంద కిషోర్ రచయితతోపాటు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ గా లతా నాయుడు, ఎడిటర్ గా టీసీ ప్రసన్న వర్క్ చేస్తున్నారు. 35-చిన్న కథ కాదు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. మరి ఈ మూవీ ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.