నివేదా థామస్ 35.. ఇది చిన్న రిస్క్ అయితే కాదు
టాలీవుడ్ లో టాలెంటెడ్ నటిగా నివేదా థామస్ కి మంచి గుర్తింపు ఉంది. ఆమె చివరిగా శాకినీ డాకినీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు
By: Tupaki Desk | 23 Aug 2024 10:30 AM GMTటాలీవుడ్ లో టాలెంటెడ్ నటిగా నివేదా థామస్ కి మంచి గుర్తింపు ఉంది. ఆమె చివరిగా శాకినీ డాకినీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. మరల రెండేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో “35 చిన్న కథ కాదు” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మధ్య కథాబలం ఉన్న సినిమాలకి మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. రీసెంట్ గా “ఆయ్” మూవీ కూడా వినోదభరిత కథాంశంతో వచ్చి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఇదే తరహాలో కథని నమ్ముకొని ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం “35 చిన్న కథ కాదు”. నివేదా థామస్ ఈ చిత్రంలో పెళ్ళైన పిల్లల తల్లిగా నటించింది.
ఒక మిడిల్ క్లాస్ వివాహిత అనుభవాలను కామెడీగా అలాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారంట. అయితే అదే రోజు దళపతి విజయ్ “The GOAT” మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వారసుడు తర్వాత విజయ్ కి తెలుగులో కూడా మార్కెట్ పెరిగింది. ఈ నేపథ్యంలో పబ్లిక్ అటెన్షన్ మొత్తం “The GOAT” సినిమాపైనే ఉంటుంది.
అయిన కూడా విజయ్ సినిమాకి పోటీగా “35 చిన్న కథ కాదు” సినిమాని థియేటర్స్ లోకి తీసుకొని రాబోతున్నారు. కచ్చితంగా ఈ సినిమా మౌత్ టాక్ తో జనాలకి చేరువ అవుతుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే ఆ సినిమా వచ్చిన తరువాత మరో రెండు రోజుల్లో దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి సుహాస్ హీరోగా తెరకెక్కిన “జనక అయితే గనక” మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాని దిల్ రాజు గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
అలాగే రాజ్ తరుణ్ “భలే ఉన్నాడే” మూవీ కూడా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మారుతి టీమ్ సమర్పణలో వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకులకి చేరువ అవుతుందని భావిస్తున్నారు. ఇన్ని సినిమాల మధ్య పోటీలో బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయిన “35 చిన్న కథ కాదు” మూవీ కేవలం నివేదా థామస్ ఇమేజ్ మీదనే థియేటర్స్ లోకి వస్తోంది. మరి ఆమె ఇమేజ్ ఈ పోటీలో ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.