Begin typing your search above and press return to search.

35-చిన్న కథ కాదు.. రిలీజ్ ఎప్పుడంటే..

రానా దగ్గుబాటి సమర్పణలో డిఫరెంట్ చిత్రంగా "35-చిన్న కథ కాదు" ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది.

By:  Tupaki Desk   |   25 Aug 2024 9:54 AM GMT
35-చిన్న కథ కాదు.. రిలీజ్ ఎప్పుడంటే..
X

రానా దగ్గుబాటి సమర్పణలో డిఫరెంట్ చిత్రంగా "35-చిన్న కథ కాదు" ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. నంద కిషోర్ ఎమని దర్శకత్వం వహించిన ఈ సినిమా, సురేశ్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టేర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రానా దగ్గుబాటి, స్రుజన్ యారాబోలు, సిద్దార్థ్ రల్లపల్లి నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు.


ఈ సినిమాలో సీనియర్ నటులైన భాగ్యరాజ్, గౌతమి వంటి ప్రముఖులు మరియు యంగ్ యాక్టర్స్ నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ వంటి ముఖ్య పాత్రల్లో తెరపై కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంతో నడిచే ఈ కథలో కుటుంబ విలువలను మంచి ఫన్, భావోద్వేగాలతో మిళితం చేసి చూపించనున్నారు.

ఇటీవలి కాలంలో తెలుగు సినిమా ప్రేక్షకులు కొత్తదనం ఉన్న కథలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నందున, ఈ సినిమా యొక్క టీజర్, పాటలు, ప్రమోషనల్ వీడియోలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందాయి. ఇక సినిమాను గత నెలలోనే విడుదల చేయాలని అనుకున్నారు. అయితే పర్ఫెక్ట్ డేట్ కోసం చూసిన మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రంను సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల చేయడానికి రెడీ అయ్యారు.

మేకర్స్ ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలు మరింత వేగం పుంజుకోవడమే కాకుండా, ఈ చిత్రాన్ని ఒక చిన్న గ్రూప్ ఆడియన్స్ కి ముందుగా చూపించగా, వాళ్ల నుంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. సినిమా పూర్తిగా కుటుంబ సభ్యులతో కూర్చొని చూడదగ్గదని అంటున్నారు.

వైవిధ్యమైన కథ, సున్నితమైన భావోద్వేగాలు కలబోసిన ఈ చిత్రానికి టెక్నికల్ టీమ్ మరింత బలాన్ని చేకూరుస్తుంది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. లత నాయుడు ప్రొడక్షన్ డిజైన్ సమకూర్చగా, టి సి ప్రసన్న ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ సినిమాలోని ప్రధాన నటులు నలుగురు తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తారని మేకర్స్ తెలిపారు.