Begin typing your search above and press return to search.

3 రోజెస్‌తో ఈసారి ఫ‌న్ మామూలుగా ఉండ‌ద‌ట‌

ఈషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సిరీస్ బాగా క్లిక్ అవ‌డంతో పాటూ ఈ సిరీస్ ను ఆడియ‌న్స్ తెగ చూశారు.

By:  Tupaki Desk   |   8 March 2025 2:58 PM IST
3 రోజెస్‌తో ఈసారి ఫ‌న్ మామూలుగా ఉండ‌ద‌ట‌
X

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఓ వైపు సినిమాలు, మ‌రోవైపు టాక్ షోలు, వెబ్ సిరీస్‌తో ఆడియ‌న్స్ ను అల‌రిస్తోంది. ఒరిజిన‌ల్ సినిమాల‌తో పాటూ వెబ్ సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్టైన్ చేస్తున్న ఆహా ఇప్పుడు మ‌రో సిరీస్ తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కొన్నాళ్ల కింద‌ట ఆహాలో 3 రోజెస్ వెబ్ సిరీస్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

ఈషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సిరీస్ బాగా క్లిక్ అవ‌డంతో పాటూ ఈ సిరీస్ ను ఆడియ‌న్స్ తెగ చూశారు. ఈ సిరీస్‌కు సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసిన వారికి గుడ్ న్యూస్ చెప్తూ 3 రోజెస్ సీజ‌న్2 కు సంబంధించిన ఓ టీజ‌ర్ ను రిలీజ్ చేస్తూ టీమ్ స్వీట్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది.

ఈ అనౌన్స్‌మెంట్ వీడియోలో హ‌ర్ష చెముడు, ఈషా రెబ్బా కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఈషాని నీ వేస్ట్ బ్యాచ్ ఎక్క‌డ‌ని హ‌ర్ష అడ‌గ్గా ఒకామెకు పెళ్లైపోయింది, ఇంకొక‌రు టూర్స్ తిరుగుతూ ఉన్నార‌ని చెప్ప‌గా, నువ్వేమో ఇలా సింగిల్ చింత‌కాయ‌లా మిగిలిపోయావా అని సెటైర్ వేయ‌గానే ఒక్క‌దాన్నే అని ఎవ‌రు చెప్పారు. ఇప్పుడు కూడా ఇద్ద‌రున్నారంటుంది. అంటే 2 కొత్త రోజెస్ అని హ‌ర్ష అడిగితే, అవును, ఈ సారి ఫ‌న్ మామూలుగా ఉండ‌ద‌ని 3 రోజెస్ సీజ‌న్2పై హైప్ పెంచేసింది టీమ్.

అయితే ఈషా ఫ్రెండ్స్ గా న‌టించనున్న ఆ ఇద్ద‌రు కొత్త రోజెస్ ఎవ‌రనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 3 రోజెస్‌కు మారుతి షో ర‌న్న‌ర్ గా వ్య‌వ‌హ‌రించగా, మ్యాగీ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. బేబీ చిత్ర నిర్మాత ఎస్‌కెఎన్ ఈ సిరీస్‌ను నిర్మించారు. వేర్వేరు నేప‌థ్యాల నుంచి వ‌చ్చిన ముగ్గుర‌మ్మాయిల చుట్టూ తిరిగే క‌థ‌, ఎమోష‌న్స్, కామెడీతోనే ఈ సిరీస్ కూడా రూపొంద‌నున్న‌ట్టు అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా తెలిసిపోతుంది. త్వ‌ర‌లోనే ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది.