ఆ హీరో కోసం టర్కీ నుంచి 500 మంది!
అలాగే బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీ కూడా ఇలాంటి భారీ గీతాలు చాలానే తెరకెక్కించారు.
By: Tupaki Desk | 7 March 2025 4:31 PM500 మందితో గ్రూప్ సాంగ్...1000 మందితో వార్ సీన్ అంటే? సినిమాకి భారీ హైప్ క్రియేట్ అవుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఇలాంటి ప్రయోగాలు శంకర్ ఎప్పుడో చేసేసేసారు. భారీ సెట్లు వేసి వాటిలో వందలాది మందితో ఎన్నో పాటుల...యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించి వాటిలో తానో స్పెషలిస్ట్ అని ఎప్పుడో ప్రూవ్ చేసారు. అలాగే బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీ కూడా ఇలాంటి భారీ గీతాలు చాలానే తెరకెక్కించారు.
అయితే వాళ్లు చేసిన సమయంలో సోషల్ మీడియా ఇంపాక్ట్ అంతగా లేదు కాబట్టి ఆ విషయం పెద్దగా హైలైట్ అవ్వలేదు. ఇప్పుడు ప్రతీ చిన్న విషయం కూడా సోషల్ మీడియా కారణంగా స్పెషల్ గాఫోకస్ అవుతుంది. ప్రస్తుతం 'వార్ 2' లో భాగంగా హృతిక్ రోషన్ -ఎన్టీఆర్ మధ్య ఓ సాంగ్ కంపోజింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కూడా 500 మంది డాన్సర్లు కనిపిస్తారని ఇప్పటికే లీకైంది. సినిమాకి ఈ పాట హైలైట్ గా ఉంటుందని..షూట్ కోసం ప్రత్యేకంగా ఓ భారీ సెట్ నే నిర్మించి షూట్ చేస్తున్నారు.
తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న'సికిందర్' లోకూడా అలాంటి ఎలివేషన్ ఒకటుందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ పై ఓ సాంగ్ షూట్ కోసం ఏకంగా టర్కీ నుంచి స్పెషల్ డాన్సర్లను రంగంలోకి దించుతన్నారుట. దాదాపు 500 మంది స్పెషల్ ప్లైట్ లో టర్కీ నుంచి ముంబైకి రప్పిస్తున్నారుట. వాళ్లంతా డాన్సింగ్ లో ఆరితేరిన వారని సమాచారం. ఈ పాట కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్లైట్ ఛార్జీలు..వాళ్లకు చెల్లించాల్సిన పారితోషికం..ప్రత్యేకంగా సిద్దం చేస్తోన్న సెట్ ఇలా మొత్తం కలిపితే కోట్లే ఖర్చు అవుతుంది. సినిమాలో ఈపాట విజువల్ ట్రీట్ లా ఉంటుందంటున్నారు. సినిమాలో వచ్చేది కూడా ఇదే చివరి పాట అని సమాచారం. ఈ పాట సల్మాన్ ఖాన్ కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన పాటగా మిగిలిపోతుందంటున్నారు.