21వ శతాబ్దపు ఉత్తమ నటుల్లో ఏకైక భారతీయుడు?
ఈ సినిమా దిగ్గజాలలో ఇర్ఫాన్ ఖాన్ 41వ స్థానాన్ని సంపాదించి, జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడిగా నిలిచాడు.
By: Tupaki Desk | 30 Dec 2024 7:52 PM GMTహాలీవుడ్ ప్రఖ్యాత మ్యగజైన్ 'ది ఇండిపెండెంట్' 21వ శతాబ్దపు 60 మంది ఉత్తమ నటుల జాబితాను ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభను ఈ జాబితా వెలువరించింది. ఈ సినిమా దిగ్గజాలలో ఇర్ఫాన్ ఖాన్ 41వ స్థానాన్ని సంపాదించి, జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడిగా నిలిచాడు.
అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ సహా ఎందరో స్టార్లు భారతదేశంలో ఉన్నారు. కానీ ఎవరికీ దక్కని గౌరవం దివంగత నటుడు ఇర్ఫాన్ కి దక్కింది. ఇర్ఫాన్ ఖాన్ నటనా వైవిధ్యం, విలక్షణత అతడికి ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు కల్పించాయి. ఇర్ఫాన్ 2020లో 53 సంవత్సరాల వయస్సులో అకాల మరణానికి ముందు ప్రపంచ సినిమాపై చెరగని ముద్ర వేసిన నటుడు. ఎన్నో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఆంగ్ లీ 'లైఫ్ ఆఫ్ పై'లోను ఇర్ఫాన్ - టబు జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఆసిఫ్ కపాడియా 'ది వారియర్' (2001)లో ఇర్ఫాన్ అద్భుతమైన నటన విమర్శకుల ప్రశంసలు పొందింది.
ఇర్ఫాన్ ఖాన్ ఫిల్మోగ్రఫీలో బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించిన సినిమాల్లో..హాసిల్ (2003), మక్బూల్ (2003), ది నేమ్‌సేక్ (2006), లైఫ్ ఇన్ ఎ మెట్రో (2007), స్లమ్‌డాగ్ మిలియనీర్ (2008), పాన్ సింగ్ తోమర్ (2012), లైఫ్ ఆఫ్ పై (2012), ది లంచ్‌బాక్స్ (2013), హిందీ మీడియం (2017), అంగ్రేజీ మీడియం (2020) తదితర చిత్రాలు ఉన్నాయి. కళ్ళు, ఘాడమైన గోధుమ రంగు శాశ్వతంగా జీవించగలవు. పెదవులు కదపకుండానే కవిత్వం చెప్పగలిగే మెజీషియన్ అతడు... అని ది ఇండిపెండెంట్ ప్రశంసించింది.
21వ శతాబ్దపు టాప్ 10 నటులు:
#1: ఫిలిప్ సేమౌర్ హాఫ్మన్
#2: ఎమ్మా స్టోన్
#3: డేనియల్ డే-లూయిస్
#4: డెంజెల్ వాషింగ్టన్
#5: నికోల్ కిడ్మాన్
#6: డేనియల్ కలుయుయా
#7: సాంగ్ కాంగ్ హో
#8: కేట్ బ్లాంచెట్
#9: కోలిన్ ఫారెల్
#10: ఫ్లోరెన్స్ పగ్