Begin typing your search above and press return to search.

69వ ఫిల్మ్ ఫేర్ లో స‌త్తా చాటింది వీరే

బాలీవుడ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల జాబితా రిలీజ్ అయింది

By:  Tupaki Desk   |   29 Jan 2024 6:56 AM GMT
69వ ఫిల్మ్ ఫేర్ లో స‌త్తా చాటింది వీరే
X

బాలీవుడ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల జాబితా రిలీజ్ అయింది. గుజ‌రాత్ లోని గాంధీన‌గ‌ర్ వేదిక‌గా అట్ట‌హాసంగా సాగిన ఈ వేడుక‌లో 2023 లో విడుదలైన చిత్రాల‌కు సంబంధించి విజేత‌ల్ని ప్ర‌క‌టించారు. భార్య‌భ‌ర్త‌లు ర‌ణ‌బీర్ క‌పూర్-అలియాభ‌ట్ ఉత్త‌మ న‌టుడు..న‌టి అవార్డులు గెలుచుకున్నారు. ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన '12 త్ ఫెయిల్' ఉత్త‌మ చిత్రంగా నిల‌వ‌గా.. ఇదే సినిమా ద‌ర్శ‌కుడు ఉత్త‌మ ద‌ర్శ‌కుడు అవార్డు అందుకున్నారు.

సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'యానిమ‌ల్' చిత్రానికి అవార్డుల పంట పండింది. నటుడు.. గాయకుడు.. సంగీతం .. నేపథ్య సంగీతం.. సౌండ్ డిజైన్ ఇలా మొత్తం ఐదు విభాగాల్లో యానిమ‌ల్ అవార్డులు అందుకుంది. అలాగే `12 త్ ఫెయిల్` కూడా ఐదు విభాగాల్లో అవార్డులు అందుకుంది. అలాగే `రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ క‌హానీ` చిత్రం కూడా నాలుగు అవార్డులు ద‌క్కించుకుంది. ఈ వేడుక‌లో కరీనా కపూర్.. కరిష్మా కపూర్.. వరుణ్ ధావన్.. కార్తీక్ ఆర్యన్ పెర్ఫార్మన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో విజేతలు వీరే:

ఉత్తమ సినిమా: 12త్ ఫెయిల్

ఉత్తమ సినిమా (క్రిటిక్స్): జోరామ్

ఉత్తమ దర్శకుడు: విధు వినోద్ చోప్రా (12త్ ఫెయిల్)

ఉత్తమ నటుడు: రణబీర్ కపూర్ (యానిమల్)

ఉత్తమ నటి: ఆలియా భట్ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్): విక్రాంత్ మెస్సీ (12త్ ఫెయిల్)

ఉత్తమ నటి (క్రిటిక్స్): రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)

ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్ (డంకీ)

ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని)

ఉత్తమ సాహిత్యం: అమితాబ్ భట్టాచార్య (తేరే వాస్తే పాట - జరా హట్కే జరా బచ్కే)

ఉత్తమ సంగీతం: యానిమల్ (ప్రీతమ్, విశాల్ మిశ్రా, మన్నన్ భరద్వాజ్, శ్రేయాస్ పురానిక్, జానీ, భూపిందర్ బాదల్, అశిమ్ కెమ్సన్, హర్షవర్ధన్ రామేశ్వర్, గురిందర్ సెహగల్)

ఉత్తమ గాయకుడు: భూపిందర్ బాదల్ (అర్జన్ వ్యాలీ - యానిమల్)

ఉత్తమ గాయని: శిల్పా రావు (బేషరమ్ రంగ్ - పఠాన్)

ఉత్తమ కథ: అమిత్ రాయ్ (ఓ మై గాడ్ 2)

ఉత్తమ కథనం: విధు వినోద్ చోప్రా (12త్ ఫెయిల్)

ఉత్తమ సంభాషణలు: ఇషితా మొయిత్రా (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని)

ఉత్తమ నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్)

ఉత్తమ యాక్షన్: స్పారో రజాటోస్, ANL అరసు, క్రేగ్ మాక్రే, యానిక్ బెన్, కెచా ఖమ్‌ ఫక్డీ, సునీల్ రోడ్రిగ్స్ (జవాన్)

ఉత్తమ ఛాయాగ్రహణం: అవినాష్ అరుణ్ ధావరే (త్రీ ఆఫ్ అస్ )

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: సుబ్రతా చక్రవర్తి, అమిత్ రే (సామ్ బహదూర్)

ఉత్తమ దుస్తులు: (కాస్ట్యూమ్ డిజైన్): సచిన్ లవ్‌లేకర్, దివ్య గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్)

బెస్ట్ సౌండ్ డిజైన్: కునాల్ శర్మ (సామ్ బహదూర్) & సింక్ సినిమా (యానిమల్)

ఉత్తమ కూర్పు : (ఎడిటింగ్): జస్ కున్వర్ సింగ్ కోహ్లీ, విధు వినోద్ చోప్రా (12వ ఫెయిల్)

బెస్ట్ వీఎఫ్ఎక్స్: రెడ్ చిల్లీస్ VFX (జవాన్)

ఉత్తమ కొరియోగ్రఫీ: గణేష్ ఆచార్య ('వాట్ ఝుమ్కా' పాట - రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)