బాక్సాఫీస్ @700 కోట్లు.. ఎన్ని సినిమాలు బ్రేక్ చేశాయంటే.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు 700 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితా చూసుకుంటే
By: Tupaki Desk | 16 Sep 2023 3:53 AM GMTషారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ జవాన్. థియేటర్స్ లో ఇప్పటికి సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ ఏడాది ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రెండు సినిమాలు మాత్రమే ఇప్పటి వరకు 700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా ఆ రెండు షారుఖ్ ఖాన్ నుంచి రావడం విశేషం.
ఇలా ఓకే ఏడాదిలో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్స్ కొట్టిన హీరోగా షారుఖ్ నిలిచిపోయాడు. నయనతార, విజయ్ సేతుపతి లాంటి సౌత్ స్టార్స్ ఉండటం కూడా జవాన్ సినిమాకి బాగా కలిసొచ్చింది. సౌత్ లో ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఇచ్చింది. ఇక షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. క్యారెక్టరైజేషన్స్ లో వేరియేషన్స్ చూపిస్తూ నార్త్ ఇండియన్ ఆడియన్స్ ని పూర్తిస్థాయి మాస్ కమర్షియల్ స్టోరీతో ఎంటర్టైన్ చేశారు.
ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా జవాన్ మూవీ 700 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు 700 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో దంగల్ మూవీ ఉంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2024 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. రెండో స్థానంలో బాహుబలి 2 నిలిచింది. ఈ చిత్రం 1810 కోట్ల కలెక్షన్స్ సాధించింది.
మూడో స్థానంలో 1316 కోట్లతో ఆర్ఆర్ఆర్ ఉంది. నాలుగో స్థానంలో 1250 కోట్లతో కేజీఎఫ్ చాప్టర్ 2 నిలిచింది. 1050 కోట్లతో పఠాన్ ఐదో స్థానంలో ఉండటం విశేషం. బజరంగీ భాయిజాన్ 910 కోట్లు, సీక్రెట్ సూపర్ స్టార్ 880 కోట్లు, పీకే 769 కోట్లు ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలుగా నిలిస్తే. ఇప్పుడు జవాన్ 700 కోట్ల క్లబ్ లో చేరి ఈ జాబితాలోకి వచ్చింది.
ఇంకా జవాన్ డీసెంట్ కలెక్షన్స్ ని ప్రపంచ వ్యాప్తంగా అందుకుంటూ దూసుకుపోతోంది. జవాన్ కి పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేవు. సెప్టెంబర్ 15న తమిళంలో వచ్చిన మార్క్ ఆంటోనీ మూవీ మాత్రమే కొంచెం పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. అయితే నార్త్ లో మార్క్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి మరో వారం, పది రోజులు జవాన్ కలెక్షన్స్ ప్రభంజనం ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా. అదే జరిగితే వెయ్యి కోట్లు జవాన్ దాటిపోతుంది.