70వ జాతీయ అవార్డులు..విమర్శలు లేని వేళ!
అయితే తాజాగా ప్రకటించిన 70 జాతీయ అవార్డుల వేడుకల్లో అందుకు ఆస్కారం ఎక్కడా లేనట్లే ఉంది. ఏ భాష నుంచి కూడా అవార్డులపై విమర్శలు తెరపైకి రాలేదు.
By: Tupaki Desk | 17 Aug 2024 5:38 AM GMTజాతీయ అవార్డుల ప్రకటనపై అప్పుడప్పుడు చిన్నపాటి వ్యతిరేకత వ్యక్తమవుతుంటుంది. కమిటీ నియమ నిబంధనలకు లోబడి జ్యూరీ సినిమాల్ని అవార్డులకు ఎంపిక చేస్తుంటుంది. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ప్రేక్షకుల అంచనాలు తప్పుతుంటాయి. పలానా సినిమాకి జాతీయ అవార్డు ఖాయం అనుకున్న సినిమాకి అవార్డు రాదు..ఏమాత్రం అంచనాలు లేని సినిమాకి అవార్డు వచ్చే సరికి షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడు తుంది.
అయితే తాజాగా ప్రకటించిన 70 జాతీయ అవార్డుల వేడుకల్లో అందుకు ఆస్కారం ఎక్కడా లేనట్లే ఉంది. ఏ భాష నుంచి కూడా అవార్డులపై విమర్శలు తెరపైకి రాలేదు. జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టం'( మలయాళం) దక్కించుకుంది. మనిషి వ్యక్తిత్వాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమాకి అవార్డు రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి ఎంపిక అంతే ఆమోదయోగ్యంగా ఉంది.
'కాంతారా'లో అతడి నటనని గుర్తించి ఎంపిక చేసారు. ఈ సినిమాతో పాన్ ఇండియాలోనే గుర్తింపు దక్కించుకున్నాడు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతగానో ఆదరించారు. రిషబ్ శెట్టి ఎవరో తెలియకపోయినా? అతడి నటన..కథని ఆధారంగా చేసుకుని ప్రేక్షకుల్ని మెప్పించిన చిత్రంగా నిలిచింది. తెలుగు మార్కెట్ నుంచి ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. రిశబ్ శెట్టి నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
అలాగే కన్నడ నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం 'కేజీఎఫ్ -2' నిలిచింది. దీంతో పాటు ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ గానూ 'కేజీఎఫ్ -2'కి పనిచేసిన అన్బిరివ్ కి ఇదే సినిమాకి గాను అవార్డు వరించింది. అలా ఈసారి వేడుకల్లో కన్నడ ఇండస్ట్రీ అవార్డుల మోత మెగించింది. అలాగే ఉత్తమ ప్రాంతీయ చిత్రం గా తెలుగు నుంచి 'కార్తికేయ-2' నిలిచిన సంగతి తెలిసిందే. కృష్ణతత్వం ఆధారంగా చందు మొండేటి తెరకెక్కించిన సినిమా నార్త్ ఆడియన్స్ కి ఎంతగానో కనెక్ట్ అయింది. 'బలగం', 'మేజర్' లాంటి సినిమాల్ని పక్కకు నెట్టి 'కార్తికేయ-2' ఉత్తమ చిత్రంగా ఎంపికవ్వడం విశేషం.