7/G బృందావన్ కాలనీ సీక్వెల్.. ఇప్పటికీ సస్పెన్సే!
ఇప్పుడు న్యూ ఇయర్ స్పెషల్ గా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. మూవీ ఫస్ట్ లుక్ పేరుతో ఓ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.
By: Tupaki Desk | 1 Jan 2025 10:22 AM GMT7/G బృందావన్ కాలనీ.. సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న లవ్ స్టోరీస్ మూవీస్ లిస్ట్ లో ముందు వరుసలో కచ్చితంగా ఉంటుంది. రవి కృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఆ మూవీ అప్పట్లో ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కగా.. 20 ఏళ్ల క్రితం విడుదలైంది.
తమిళ, తెలుగు భాషల్లో వచ్చిన ఆ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. 90స్ కిడ్స్ అందరికీ ఫేవరేట్ మూవీగా నిలిచిపోయిందనే చెప్పాలి. ఇప్పటికీ టీవీలో వచ్చినా.. కచ్చితంగా చూస్తుంటారు అందరూ. అంతలా ఆ సినిమా అందరినీ మెప్పించింది. ఆ తర్వాత రీ రిలీజ్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి అదరగొట్టింది.
అయితే ఆ సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు కొద్ది రోజుల క్రితం మేకర్స్ కన్ఫామ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోగా.. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ షూటింగ్ ను మాత్రం సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు. క్యాస్టింగ్ సహా ఎలాంటి విషయాలు లీక్ అవ్వకుండా చూసుకుంటున్నారు.
ఇప్పుడు న్యూ ఇయర్ స్పెషల్ గా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. మూవీ ఫస్ట్ లుక్ పేరుతో ఓ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. చుట్టూ ఎత్తైన భవనాల మధ్య ఉన్న రహదారిలో ఒక జంట బ్యాగులు పట్టుకుని నడుస్తూ కనిపించారు. వారిని ఫేస్ ను రివీల్ చేయని మేకర్స్.. కనీసం వారెవరో కూడా ఎక్కడా ఎలాంటి క్లూ కూడా ఇవ్వలేదు.
ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు చెప్పి షాకిచ్చారు మేకర్స్. లీడ్ రోల్స్ విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. అప్పుడు నటించిన రవికృష్ణ, సోనియా అగర్వాల్ యాక్ట్ చేస్తున్నారా లేక కొత్త వాళ్లు నటిస్తున్నారా అన్నది ఇప్పుడు సినీ ప్రియుల్లో పెద్ద క్వశ్చన్ గా మారిందని చెప్పాలి.
ఇక సినిమా విషయానికొస్తే.. ఫస్ట్ పార్ట్ ను తెరకెక్కించిన సెల్వ రాఘవన్ ఇప్పుడు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతగా అప్పుడు వ్యవహరించిన ఏఎం రత్నం సీక్వెల్ నూ నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. రామ్ జీ సినిమాటోగ్రఫీ వర్క్స్ చూసుకుంటున్నారు. అయితే షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉండడంతో మేకర్స్ మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు! మరి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.