Begin typing your search above and press return to search.

మైత్రి 8 వసంతాలు.. టీజర్ రెడీ

ఫీమేల్ సెంట్రిక్ కథతో తెరకెక్కుతోన్న ‘8 వసంతాలు’ అనే సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ని మైత్రీ మూవీ మేకర్స్ రివీల్ చేశారు.

By:  Tupaki Desk   |   7 Oct 2024 7:23 AM GMT
మైత్రి 8 వసంతాలు.. టీజర్ రెడీ
X

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఓ వైపు పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే మరో వైపు మినిమమ్ బడ్జెట్ కథలతో, డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు. ఫీమేల్ సెంట్రిక్ కథతో తెరకెక్కుతోన్న ‘8 వసంతాలు’ అనే సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ని మైత్రీ మూవీ మేకర్స్ రివీల్ చేశారు. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ డ్రామాలో అనంతిక సునీల్ కుమార్ లీడ్ రోల్ లో నటిస్తోంది.

మధురం అనే షార్ట్ ఫిల్మ్ తో అందరికి కనెక్ట్ అయిన ఫణీంద్ర నర్సెట్టి తరువాత చాందిని చౌదరి లీడ్ రోల్ లో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మను’ తో దర్శకుడిగా బిగ్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. 2018లో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలని మెప్పించి ‘8 వసంతాలు’ మూవీ స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే విజయ దశమికి ఈ సినిమా నుంచి సుద్ధి అయోధ్య క్యారెక్టర్ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ పాత్రలో అనంతిక సునీల్ కుమార్ కనిపించబోతోంది. ఇప్పటికే ‘రాజమండ్రి రోజ్ మిల్క్’, ‘మ్యాడ్’, ‘లాల్ సలామ్’ సినిమాలతో అనంతిక సునీల్ కుమార్ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమెని మెయిన్ లీడ్ గా చేసుకొని ఫీమేల్ సెంట్రిక్ కథాంశంతో ‘8 వసంతాలు’ మూవీ కథని ఫణీంద్ర నర్సెట్టి చెప్పబోతున్నారు. ఈ మూవీ కథాంశం 8 వసంతాల కాలంలో ఒక అమ్మాయి జీవితంలో జరిగే ప్రయాణంగా ఉంటుందంట.

కాస్తా పొయిటిక్ స్టైల్ లో ఇంటరెస్టింగ్ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు తెలుస్తోంది. విట్ నెస్ ది పవర్ ఆఫ్ సుద్ధి అయోధ్య అంటూ కరాటే ప్రాక్టీస్ చేస్తోన్న అనంతిక సునీల్ కుమార్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ తో టీజర్ రిలీజ్ ని కన్ఫర్మ్ చేశారు. మొదటి సినిమాతో డిఫరెంట్ కంటెంట్ ని తెరపై ఆవిష్కరించిన ఫణీంద్ర నర్సెట్టి ఈ సారి ‘8 వసంతాలు’ సినిమాని ఏ విధంగా చూపించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

చిన్న సినిమాల జోలికి పెద్దగా వెళ్లని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకి ఈ సినిమా కథాంశం ఎంతో నచ్చి ఉంటుంది కాబట్టి స్టార్ క్యాస్టింగ్ లేకపోయిన నిర్మించడానికి సిద్ధమయ్యారు. అలాగే మూవీని స్ట్రాంగ్ గా ప్రమోట్ చేస్తూ మార్కెట్ లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి బడా ప్రొడక్షన్ లో వస్తోన్న ఈ చిన్న సినిమా ఆడియన్స్ అటెన్షన్ ని ఏ మేరకు అందుకుంటుందో వేచి చూడాలి.