Begin typing your search above and press return to search.

800 ట్రైలర్.. స్పిన్ మాంత్రికుడి జీవిత జాలం

ఈ శ్రీలంక క్రికెటర్ బయోపిక్ ను 800 ది మూవీ పేరుతో ఇండియాలోనే భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సిద్ధమవుతూ ఉండడం విశేషం.

By:  Tupaki Desk   |   5 Sep 2023 11:56 AM GMT
800 ట్రైలర్.. స్పిన్ మాంత్రికుడి జీవిత జాలం
X

ఇటీవల కాలంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న బయోపిక్ సినిమాలకు అనుకున్నంత స్థాయిలో అయితే రెస్పాన్స్ అయితే దక్కడం లేదు. అప్పట్లో కొన్ని క్రీడా నేపథ్యంలో వచ్చిన సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు బ్రహ్మరథం అయితే పట్టారు. కానీ ఇప్పుడు మాత్రం వాటిపై అంతగా ఆసక్తి చూపించడం లేదు ఆ మధ్య 1983 వరల్డ్ కప్ సినిమాతో పాటు మిథాలీ రాజ్ బయోపిక్ అలాగే సచిన్ బయోపిక్ కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యాయి.

అయితే ఇప్పుడు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే స్పిన్ మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథను వెండితెరపై తీసుకురాబోతున్నారు. ఈ శ్రీలంక క్రికెటర్ బయోపిక్ ను 800 ది మూవీ పేరుతో ఇండియాలోనే భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సిద్ధమవుతూ ఉండడం విశేషం.

ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరపైకి రాబోతున్న ఈ సినిమా కోసం మొదట విజయ సేతుపతిని సంప్రదించారు. కానీ శ్రీలంక తమిళలకు ఉన్న సెన్సిటివ్ గొడవల కారణంగా మురళీధరన్ పాత్ర చేయడానికి ఆ నటుడు వెనుకడుగు వేశాడు. ఇక ఆ పాత్రలో మధుర్ మిట్టల్ నటించాడు. ఈ సినిమా ట్రైలర్ను నేడు హిందీ తమిళ్ తెలుగు భాషల్లో విడుదల చేశారు.

ట్రైలర్ విషయానికి వస్తే మురళీధర న్ చిన్నతనం నుంచి క్రికెట్ చరిత్రలో అతను నెలకొల్పిన రికార్డుల వరకు అలాగే అతని బౌలింగ్ పై వచ్చిన అభ్యంతరాలపై కూడా సినిమాలో హైలెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీలంకలో అతని చిన్నతనంలోనే వర్గ విభేదాలకు సంబంధించిన అంశాలను ట్రైలర్ లో హైలెట్ చేశారు. ఇక తర్వాత ఒక నిరుపేద కుటుంబం నుంచి మురళీధరన్ ఒక క్రికెటర్ గా ఎలా మారాడు అనే అంశాన్ని కూడా ట్రైలర్లో చూపించారు.

నాజర్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. క్రికెట్ చరిత్రలో నెంబర్ వన్ స్పిన్ బౌలర్ గా ఎదిగిన మురళీధర్ బౌలింగ్ లో ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు. అతని మోచేయి సరిగ్గా స్ట్రైట్ గా రావడం లేదు అనే విధంగా అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. అతని కెరీర్ మొత్తం కూడా అప్పుడే ముగుస్తుంది అని అందరూ అనుకున్నారు.

కానీ మళ్ళీ అతను ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యాడు అనే జీవిత కథను ఇందులో మరింత హైలెట్ చేయబోతున్నట్లు ట్రైలర్ ద్వారా చూపించారు. ఇక ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని క్రికెట్ బయోపిక్స్ అయితే దారుణంగా డిజాస్టర్ అవుతున్నాయి. మరి ఇప్పుడు 800 ద మూవీ సినిమాను ఆడియెన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు చూడాలి. MS శ్రీపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ట్రైన్ మోషన్ పిక్చర్స్ - వివేక్ రాగచారి సంయుక్తంగా నిర్మించారు.