Begin typing your search above and press return to search.

'8 A.M. మెట్రో'.. ఎమోషనల్ డ్రామా

అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం.. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   13 May 2024 3:22 PM GMT
8 A.M. మెట్రో.. ఎమోషనల్ డ్రామా
X

తెలుగులో మల్లేశం సినిమాతో డైరెక్టర్ రాజ్ రాచకొండ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. కమెడియన్ ప్రియదర్శి లీడ్ రోల్ పోషించిన ఈ మూవీ మంచి హిట్ అయింది. అయితే మల్లేశం మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన రాజ్ రాచకొండ.. ఏడాది క్రితం ఓ బాలీవుడ్ సినిమాను తెరకెక్కించారు. ఆ మూవీనే '8 A.M. మెట్రో'. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం.. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కించుకుంది.


గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్ ప్రధాన పాత్రలు పోషించిన '8 A.M. మెట్రో' చిత్రం.. గత ఏడాది మే 19న థియేటర్లలో రిలీజ్ అయింది. తక్కువ స్క్రీన్లలోనే విడుదల అయినా.. మంచి టాక్ అందుకుంది. అయితే థియేటర్లలో రిలీజైన సంవత్సరం తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. మే 10 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన 'అందమైన జీవితం' పుస్తకం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు రాజ్ రాచకొండ.

ఇప్పుడు '8 A.M. మెట్రో' మూవీ ఓటీటీలో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. విమర్శకుల నుంచి సాధారణ సినిమా ప్రేక్షకుల వరకు అంతా ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినీ ప్రియులు తప్పక చూడాల్సిన ఎమోషనల్ మూవీ అని నెటిజన్లు చెబుతున్నారు. సోషల్ మీడియాలో సూపర్ రివ్యూలు ఇస్తున్నారు. ఈ సినిమాను ఎలాంటి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వొద్దని చెబుతున్నారు. డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు.

కొద్ది నెలల్లో తాను చూసిన బెస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ '8 A.M. మెట్రో' అని ఓ నెటిజన్ తెలిపారు. హీరోహీరోయిన్లు యాక్టింగ్ అదరగొట్టేశారని చెప్పారు. చివరి 20 నిమిషాలు అస్సలు మిస్ అవ్వొద్దని, ఫుల్ ఎమోషన్స్ తో నిండిపోయి ఉందని రివ్యూ ఇచ్చారు. ఫస్ట్ బాలీవుడ్ మూవీనే రాజ్ రాచకొండ అద్భుతంగా తీశారని కొనియాడారు. మళ్లీ మళ్లీ చూడాల్సిన సినిమాల లిస్ట్ లో ఈ మూవీ మస్ట్ గా ఉంటుందని పేర్కొన్నారు.

'8 A.M. మెట్రో' సినిమా షూటింగ్ ఎక్కువ శాతం హైదరాబాద్ మెట్రోలో సాగింది. సుమారు రూ.4 కోట్ల బడ్జెట్‍ తో కిశోర్ గంజితో కలిసి దర్శకుడు రాజ్‍ రాచకొండ నిర్మించారు. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం అందించారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ చేశారు. హీరోయిన్ అనన్య నాగళ్ల ఈ సినిమాకు రైటర్ గా పనిచేసింది. '8 A.M. మెట్రో' మూవీ క‌థ‌లో స‌హకారం అందించినట్లు రీసెంట్ గా తెలిపింది అనన్య.

స్టోరీ లైన్ ఇదే..

నాందేడ్ కు చెందిన ఐరావ‌తి (సయామీ ఖేర్)కి వివాహం జరిగి ఇద్ద‌రు పిల్ల‌లు ఉంటారు. అయితే త‌న చెల్లి కోసం, ఐరావ‌తి హైద‌రాబాద్ రావాల్సి వ‌స్తుంది. ట్రైన్ ఎలా ఎక్కాలో తెలియ‌ని ఆమె.. రోజూ మెట్రోలో ప్ర‌యాణించాల్సి వ‌స్తుంది. అప్పుడు మెట్రోలో ఆమెకు ప్రీతమ్ (గుల్షన్ దేవయ్య) ప‌రిచ‌యం అవుతాడు. అలా ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏమైందనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.