Begin typing your search above and press return to search.

ప‌న్ను చెల్లింపుల్లో కింగ్ కోహ్లీని మించిన ఖాన్

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ షారూఖ్ ఖాన్ 2024లో భారతీయ సెలబ్రిటీలందరిలో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా నిలిచాడు. ఫార్చ్యూన్ ఇండియా క‌థ‌నం ప్రకారం... షారుఖ్ రూ.92 కోట్ల పన్ను చెల్లించాడు.

By:  Tupaki Desk   |   5 Sep 2024 7:36 AM GMT
ప‌న్ను చెల్లింపుల్లో కింగ్ కోహ్లీని మించిన ఖాన్
X

కింగ్ ఖాన్ షారూఖ్ హ్యాట్రిక్ విజ‌యాల‌తో మాంచి జోష్‌లో ఉన్నాడు. అత‌డి ఆదాయం కూడా అమాంతం పెరిగింది. దానికి తగ్గ‌ట్టుగానే అత‌డు హ‌రూన్ ఇండియా జాబితాలో 7,300 కోట్ల ఆస్తుల‌తో నంబ‌ర్ -1 స్థానాన్ని అందుకున్నాడు. ఇప్పుడు పెరిగిన ఆదాయానికి త‌గ్గ‌ట్టే ప‌న్ను చెల్లింపుల్లోను కింగ్ ఖాన్ ముందున్నాడు.

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ షారూఖ్ ఖాన్ 2024లో భారతీయ సెలబ్రిటీలందరిలో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా నిలిచాడు. ఫార్చ్యూన్ ఇండియా క‌థ‌నం ప్రకారం... షారుఖ్ రూ.92 కోట్ల పన్ను చెల్లించాడు. అతడి తర్వాత విజయ్ రూ.80 కోట్లు పన్ను చెల్లించాడు. సల్మాన్ ఖాన్ రూ.75 కోట్ల పన్ను చెల్లించాడు. క్రికెటర్ విరాట్ కోహ్లీ రూ.66 కోట్లు పన్ను చెల్లించాడు.

టాప్ 10లో అమితాబ్- హృతిక్

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పెట్టుబ‌డులు పెట్ట‌డం సంప‌ద‌లు కూడ‌గ‌ట్ట‌డంలో దిగ్గ‌జం అని నిరూపించాడు. అత‌డు 71 కోట్ల పన్ను చెల్లించారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ రూ.66 కోట్లు పన్ను చెల్లింపుల‌తో ఐదో స్థానంలో నిలిచాడు. అతడి తర్వాత అజయ్ దేవగన్ ఆరో స్థానంలో ఉన్నాడు. అతడు రూ.42 కోట్ల పన్ను చెల్లించాడు. ఏడో స్థానంలో ఉన్న ఎంఎస్ ధోని రూ.38 కోట్ల పన్ను చెల్లించగా, 8వ స్థానంలో ఉన్న రణబీర్ కపూర్ రూ.36 కోట్ల పన్ను చెల్లించారు. హృతిక్ రోషన్ - సచిన్ టెండూల్కర్ ఇద్దరూ రూ.28 కోట్లు పన్నుగా ఇచ్చారు.

ప‌న్ను చెల్లింపుల్లో టాప్ 20 జాబితాలో కరీనా- కియారా- కత్రినా నిలిచారు. కపిల్ శర్మ -రూ.26 కోట్లు, సౌరవ్ గంగూలీ రూ.23 కోట్లు, కరీనా కపూర్ రూ.20 కోట్లు, షాహిద్ కపూర్ రూ.14 కోట్లు, హార్దిక్ పాండ్యా రూ.13 కోట్లు, కియారా అద్వానీ రూ.12 కోట్లు చెల్లించ‌గా, మోహన్‌లాల్ - అల్లు అర్జున్ ఇద్దరూ రూ.14 కోట్లు పన్ను చెల్లించారు. ఈ ఏడాది పంకజ్ త్రిపాఠి - కత్రినా కైఫ్ ఒక్కొక్కరు రూ.11 కోట్ల పన్ను చెల్లించారు.

అమీర్ ఖాన్ -రిషబ్ పంత్ ఒక్కొక్కరు రూ.10 కోట్ల పన్ను చెల్లించి వరుసగా 21వ , 22వ స్థానంలో నిలిచారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన హాస్య-నాటకం లాల్ సింగ్ చద్దా (2022)లో అమీర్ చివరిగా కనిపించాడు. కానీ ఇది బిగ్ ఫ్లాపైంది. త‌ర్వాత అమీర్ కెరీర్ నెమ్మ‌దించింది. షారూఖ్, స‌ల్మాన్ వ‌రుసగా సినిమాలు చేస్తూ ఆర్జిస్తున్నారు. వారు భారీ మొత్తాల‌ను ప‌న్నుగా చెల్లించారు. ఆస‌క్తిక‌రంగా 7,300 కోట్ల ఆస్తులున్న షారూఖ్ 92కోట్ల ప‌న్ను చెల్లిస్తే, కేవ‌లం 1200కోట్ల ఆస్తులున్న స‌ల్మాన్ 75 కోట్లు చెల్లించాడు. ఇది కొంత విడ్డూరంగా కూడా అనిపించ‌వ‌చ్చు.