96 సీక్వల్ అంత ఈజీ కాదు సుమా..!
96 సినిమా మొదలవ్వడానికి ముందే దర్శకుడు ఒక నోట్ వేస్తాడు. అదేంటి అంటే మార్పులే ప్రశ్నలు.. మార్పులే సమాధానాలు అని. ఐతే మనం ఎంత మారినా ప్రేమ మాత్రం మారదు.
By: Tupaki Desk | 29 Dec 2024 3:30 PM GMTకొత్త కథ కథనాలతో సినిమా రూపురేఖలను మార్చేస్తున్నారు యువతరం కథానాయకులు. ముఖ్యంగా ప్రేమ కథలను చెప్పే తీరు మారుతుంది. ఒకప్పుడు ప్రేమ విఫలమవడమే సినిమా క్లైమాక్స్ గా చూపించే వారు. కానీ ఇప్పుడు అదే మొదలుగా చేసుకుని కథలు రాసుకుంటున్నారు. తమకు ఆడియన్ ఇచ్చిన రెండున్నర గంటల టైం లో తమ క్రియేటివిటీతో సర్ ప్రైజ్ చేస్తున్నారు. వెండితెర మీద వెల కొద్దీ ప్రేమ కథలు చూశాం చూస్తూనే ఉంటాం. తెర మీద సూపర్ హిట్ సక్సెస్ ఫార్ములా అంటే అది లవ్ స్టోరీనే.
ఐతే ఈ కథ ఎలా చెప్పామన్నది ప్రేక్షకుడు ఆలోచిస్తాడు. 2018 లో వచ్చిన 96 సినిమా సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది. ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. ప్రేమ్ కుమార్ 96 సినిమా కథ చెప్పిన విధానం ఆడియన్స్ ని ఫిదా చేసింది. స్కూల్ ఏజ్ లవ్ ని దర్శకుడు చాలా అందంగా చెప్పాడు. కానీ ఇది విజయం పొందిన కథ కాదు.. విరహం నిండిన కథ. కానీ దర్శకుడు ఎంతో హృద్యంగా తెరకెక్కించాడు.
96 సినిమా మొదలవ్వడానికి ముందే దర్శకుడు ఒక నోట్ వేస్తాడు. అదేంటి అంటే మార్పులే ప్రశ్నలు.. మార్పులే సమాధానాలు అని. ఐతే మనం ఎంత మారినా ప్రేమ మాత్రం మారదు. ఐతే ఈమధ్యనే మేయలగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు ప్రేమ్ కుమార్ తన నెక్స్ట్ సినిమా 96 సీక్వెల్ అని చెప్పాడు. 96 సినిమా కథ కొనసాగింపా ఎలా ఉంటుంది. ఏం చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.
స్కూల్ ఏజ్ లవ్.. హీరో హీరోయిన్ విడిపోయి చాలా ఏళ్ల తర్వాత కలుస్తారు. అప్పటికి హీరోయిన్ పెళ్లైపోతుంది. కానీ హీరో అలా ఒంటరిగా ఉంటాడు. ఐతే ఈ కథ ఇంకా ఎలా కొనసాగిస్తాడు. లేదా మరో ఇద్దరి ప్రేమ కథ 96 సీక్వెల్ గా చెబుతాడా అని ఆడియన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. 96 సినిమాకు గోవింద్ వసంత్ మ్యూజిక్ ప్రాణం లాంటిది. సినిమా సక్సెస్ లో అదే ముఖ్య పాత్ర పోషించింది. మరి ఇప్పుడు 96 సీక్వెల్ అంటున్న డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఎలాంటి కథతో వస్తారు.. ఎలా మెప్పిస్తారన్నది చూడాలి. ఐతే మిగతా కథలను కొనసాగించడం వేరు. ఒక ప్రేమ కథకు సీక్వెల్ రాయడం వేరు. మరి ఈ విషయం అనుకున్నంత ఈజీ అయితే కాదని కొందరి ప్రేక్షకుల అభిప్రాయం.