Begin typing your search above and press return to search.

'96' కి బచ్చన్‌కి ఏంటి సంబంధం?

తమిళ్‌లో సూపర్‌ హిట్‌ సినిమాగా నిలిచిన ఈ సినిమా రీమేక్‌లు మాత్రం కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి.

By:  Tupaki Desk   |   18 Feb 2025 10:30 PM GMT
96 కి బచ్చన్‌కి ఏంటి సంబంధం?
X

కోలీవుడ్‌ క్లాసిక్‌ సినిమాల్లో '96' ఒకటి అనడంలో సందేహం లేదు. విజయ్‌ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామా సెన్షేషనల్‌ సక్సెస్‌ను దక్కించుకుంది. తమిళ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా టాలీవుడ్‌లో 'జాను' టైటిల్‌తో రీమేక్ అయింది. తమిళ్‌లో దర్శకత్వం వహించిన ప్రేమ్‌ కుమార్‌ టాలీవుడ్‌లోనూ రూపొందించారు. తమిళ్‌లో సూపర్‌ హిట్‌ సినిమాగా నిలిచిన ఈ సినిమా రీమేక్‌లు మాత్రం కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. 96 మ్యాజిక్‌ రిపీట్ చేయడంలో విఫలం అయ్యారు.

విజయ్ సేతుపతి, త్రిషలు మాత్రమే ఒక మ్యాజిక్‌ చేసినట్లుగా అద్భుతంగా ఆ సినిమాలో నటించి మెప్పించారు. ఆకట్టుకునే కథ, కథనంతో పాటు వారి నటన అదనపు బలంగా మారింది. ఇద్దరి మద్య క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. అలాంటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న 96 సినిమాను మొదట బాలీవుడ్ హీరో అభిషేక్‌ బచ్చన్‌తో రూపొందించాలని దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌ భావించాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 96 సినిమా కథ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్లింది అంటూ ఆయన ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

ప్రేమ్‌ కుమార్ మాట్లాడుతూ... 96 సినిమా కథ ను రాసుకున్న సమయంలో తాను అభిషేక్‌ బచ్చన్‌తో చేస్తే బాగుంటుంది అనుకున్నాను. హిందీలో సినిమాను తీయడం వల్ల కచ్చితంగా మంచి ఫలితం దక్కుతుందని నేను అనుకున్నాను. హిందీలో ఈ సినిమాను తీసుకు వెళ్లడం కోసం ప్రయత్నాలు చేశాను. కానీ అక్కడ తనకు పెద్దగా పరిచయాలు లేకపోవడంతో బాలీవుడ్‌లో సినిమాను చేయలేక పోయాను అంటూ చెప్పుకొచ్చాడు. తనకు హిందీ బాగా వస్తుందని, తన తండ్రి ఉత్తర భారతంలో పెరగడంతో తనకు హిందీలో సినిమాలు చేయాలనే ఆసక్తి ఉండేది. అందుకే నసీరుద్దీన్ షాకి పెద్ద అభిమానిగా మారాను అన్నాడు.

ఇప్పుడు హిందీలో సినిమాను చేయాలని వెయిట్‌ చేస్తున్నాను అని ప్రేమ్‌ కుమార్‌ చెప్పాడు. తెలుగులో జాను సినిమాను చేయడం ద్వారా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేక పోవడంతో ఆ తర్వాత తెలుగులో సినిమాను చేయలేదు. కానీ హిందీలో సినిమాను చేయాలనే కోరిక అలాగే ఉంది. అందుకు ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతుందని చెప్పుకొచ్చాడు. ఇటీవల వచ్చిన మెయియఝగన్ సినిమాతో ప్రేమ్‌ కుమార్‌ మరో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. చేసిన సినిమాలు కొన్నే అయినా అన్ని భాషల్లోనూ ప్రేమ్‌ కుమార్‌కి మంచి దర్శకుడిగా పేరు ఉంది. అందుకే ప్రేమ్‌ కుమార్‌ ముందు ముందు మరిన్ని సినిమాలు చేస్తాడేమో చూడాలి.