సైలెంట్ గా 'మరకతమణి-2'
ఆది పినిశెట్టి హీరోగా కె.ఆర్. కెశరవణన్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం `మరకతమణి ` ఏడేళ్ల క్రితం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో సినిమా తెలుగులో యావరేజ్ గా ఆడింది.
By: Tupaki Desk | 27 Feb 2025 8:30 AM GMTఆది పినిశెట్టి హీరోగా కె.ఆర్. కెశరవణన్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం `మరకతమణి ` ఏడేళ్ల క్రితం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో సినిమా తెలుగులో యావరేజ్ గా ఆడింది. అప్పటికే ఆది పినిశెట్టి వరుస పరాజయాల్లో ఉన్నాడు. కానీ ఈ సినిమా ఫలితం కాస్త ఊరటనిచ్చింది. `మరకతమణి` అన్వేషణ నేపథ్యంలో సాగిన థ్రిల్లర్ చిత్రమిది.
ఆ మరకతమణి తాకిన వారంతా చనిపోతుంటారు? కానీ ఎలాగైన చేజిక్కుంచుకుని తన కష్టాలను తీర్చుకోవాలన్నది హీరో డ్రీమ్. ఈ క్రమంలో ఏం జరిగింది అన్నదే కథ. అప్పట్లో సెకెండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ కొన్ని హింట్లు వదిలారు. అయితే సినిమాకు డివైడ్ టాక్ రావడంతో వెంటనే సీక్వెల్ తీసే పని పెట్టు కోలేదు. దీంతో ఏడేళ్ల గ్యాప్ అనంతరం మళ్లీ ఆ సినిమాకి సీక్వెల్ పట్టాలెక్కించిన విషయం ఆది పినిశెట్టి తెలిపాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని స్ఫష్టం చేసాడు. ఈ నేపథ్యంలోనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన వికీలో కూడా ఎలాంటి సమాచారం అప్ డేట్ లేకపోవడంతో ఈ సినిమా ఇక లేనట్లే అనుకున్నారు. యావరేజ్ గా ఆడినా కానీ రెండవ భాగాన్ని మరింత రక్తికట్టించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈసారి ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్ లో కూడా తెరకెక్కిస్తున్నారు.
మరకతమణి అప్పట్లో కేవలం తెలుగులోనే తెరకెక్కించారు. తమిళ్ లో అనువాదంగా రిలీజ్ అయింది. తమిళ్ లో అలా రిలీజ్ అయినా ఇక్కడ కంటే అక్కడే మంచి ఫలితాలు సాధించింది. ఈ నేపథ్యంలో `మరకతమణి 2`ని రెండు భాషల్లోనూ రూపొందిస్తున్నారు. ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.