రెండేళ్లగా పని చేస్తున్నా కానీ రిలీజ్ లే లేవు!
ఆది పినిశెట్టి గురించి పరిచయం అవసరం లేదు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. తెలుగు నటుడైనా తమిళ్ లోనూ చాలా సినిమాలు చేసాడు.
By: Tupaki Desk | 27 Feb 2025 11:00 PM ISTఆది పినిశెట్టి గురించి పరిచయం అవసరం లేదు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. తెలుగు నటుడైనా తమిళ్ లోనూ చాలా సినిమాలు చేసాడు. ఒక వి చిత్రం తర్వాత పూర్తిగా కొన్నాళ్ల పాటు కోలీవుడ్ కే పరిమితమై సినిమాలు చేసాడు. అటుపై అక్కడి గుర్తిపుతో తెలుగులోనూ అవకాశాలు అందుకున్నాడు. హీరో పాత్రలతో పాటు విలన్ పాత్రలు సైతం పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు.
`గుండెల్లో గోదారి`, `మలుపు`,` రంగస్థలం`, `వైశాలి` లాంటి సినిమాలు మంచి గుర్తిపును తెచ్చిపెట్టాయి. కొంత కాలంగా తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు. `వైశాలి` దర్శకుడు అరివళగన్ తో `శబ్దం` అనే సినిమా చేసాడు. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు పెరిగాయి. అయితే ఆది సినిమా రిలీజ్ అయి చాలా కాలమవుతోంది.
ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో సినిమాలు చేయలేదా? అన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. రెండేళ్లగా నటుడిగా బిజీగా ఉన్నానన్నారు. `ఆన్ సెట్స్ లో రోజూ షూటింగ్ లో ఉంటున్నాను. కానీ నేను చేసిన సినిమాలే రిలీజ్ అయి రెండేళ్లు అవుతుంది. `డ్రైవ్` అనే ఓ ప్రయోగాత్మక చిత్రం చేసా. దేవకట్టతో `మయ సభ` చేస్తున్నాను. `మరకతమణి 2` ఆన్ సెట్స్ లో ఉంది. `అఖండ2` లోనూ నటిస్తున్నాను.
ఇలా ఇన్ని సినిమాలు చేతిలో ఉన్నా? అవి రిలీజ్ ఆలస్యమయ్యే సరికి గ్యాప్ ఏర్పడుతుంది. నటుడిగా నేను మాత్రం ఖాళీగా లేను` అని అన్నారు. ఆది రివీల్ చేయడంతో చాలా కొత్త విషయాలు తెలిసాయి. దేవ కట్ట చాలా కాలంగా సినిమాలు లేక ఖాళీగా ఉన్నారు అనుకుంటోన్న సమయంలో ఓ కొత్త కబురు చెప్పాడు. అలాగే `మరకతమణి` కి సీక్వెల్ కూడా ఆన్ సెట్స్ లో ఉందన్న విషయం బయటకు వచ్చింది.