Begin typing your search above and press return to search.

సెట్ లో దొంగ‌త‌నంతో షాకి ఇచ్చిన న‌టుడు!

అందులోనూ సినిమాలో పాత్ర‌లు వ్య‌క్త‌గ‌తంగా హృద‌యాన్ని హ‌త్తుకుంటే ఆ భారాన్ని మోయ‌డం అన్న‌ది ఇంకా క‌ష్ట‌మైన ప‌ని.

By:  Tupaki Desk   |   2 March 2025 1:00 PM IST
సెట్ లో దొంగ‌త‌నంతో షాకి ఇచ్చిన న‌టుడు!
X

ఆన్ సెట్స్ లో ఎన్నో అనుభ‌వాలు చోటు చేసుకుంటాయి. ఒక సినిమా షూట్ నుంచి బ‌య‌ట‌కు రావా లంటే? కొన్నిసార్లు ఎన్నో జ్ఞాప‌కాలు వ‌దిలి రావాల్సి వ‌స్తుంది. అలాంట‌ప్పుడు గుండె పిండేస్తుంది. రోజూ అల‌వాటైన మ‌నుషుల్ని ఒక్క‌సారిగా వ‌దిలేసి వెళ్లాలంటే మ‌న‌సుకు బాధ క‌లుగుతుంది. గుండె దుఖంతో బ‌రువెక్కుతుంది. అందులోనూ సినిమాలో పాత్ర‌లు వ్య‌క్త‌గ‌తంగా హృద‌యాన్ని హ‌త్తుకుంటే ఆ భారాన్ని మోయ‌డం అన్న‌ది ఇంకా క‌ష్ట‌మైన ప‌ని. అలాంటి అనుభ‌వం నాకు ఉందంటున్నాడు యంగ్ హీరో ఆది పీనిశెట్టి.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన 'రంగ‌స్థ‌లం' చిత్రంలో ఆది రామ్ చ‌ర‌ణ్ అన్న‌య్య పాత్ర‌లో అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ప‌ల్లెటూరి యువ‌కుడి పాత్ర‌లో ఆది పోషించిన ఓ గొప్ప పాత్ర ఎప్ప‌టికీ గుర్తిండిపోతుంది. అందులోనూ ఆ పాత్ర చ‌నిపోయిన తీరు హృద‌యాల్ని హ‌త్తుకుంటుంది. ఆ స‌న్నివేశంలో ఆది ఎంత గొప్ప న‌టుడ‌న్న‌ది ప్రూవ్ చేసాడు. అయితే ఆ పాత్ర‌లో ప్ర‌తీ స‌న్నివే శంలో క‌ళ్ల‌జోడుతో క‌నిపిస్తాడు.

తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో ఆ క‌ళ్ల‌జోడుతో త‌న బంధాన్ని ఎంతగా పెన‌వేసాడు అన్న‌ది అర్ద‌మ‌వుతుంది. 'రంగ‌స్థ‌లం' అనుభ‌వం గురించి చెప్పిండి అంటే? 'నేను రంగస్థలం సినిమాలో పెట్టుకున్న కళ్ళజోడు ఎవరికీ తెలియకుండా తెచ్చేసాను. అది ఇప్ప‌టికీ నా దగ్గరే ఉంది. ఈ విషయం ఎవరికీ తెలీదు. నేను బ‌య‌ట క‌ళ్ల‌ద్దాలు పెట్టుకోను. సినిమాలో ఆపాత్ర డిమాండ్ చేయ‌డంతో పెట్టుకుంటాను. కానీ అద్దాలు ఆ మూవీ ప్రాప‌ర్టీ. కానీ అది నా ఆస్తిగా భావించాను. షూటింగ్ అయిపోయాక ఎవరికీ చెప్పకుండా ఆ కళ్లజోడుని సైలెంట్ గా ఇంటికి తెచ్చుకున్నాను.

దాని గురించి ఎవ్వరూ అడగలేదు. ఆ క‌ళ్ల‌ద్దాలు చూస్తున్న‌ప్పుడ‌ల్లా రంగ స్థ‌లంలో నా పాత్రే గుర్తు కొస్తుందన్నాడు. ఆది న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నాడు. తెలుగు న‌టుడైనా త‌మిళ్ లోనూ చాలా సినిమాలు చేసాడు. 'గుండెల్లో గోదారి', 'మ‌లుపు',' రంగ‌స్థ‌లం', 'వైశాలి' లాంటి సినిమాలు మంచి గుర్తిపును తెచ్చిపెట్టాయి. కొంత కాలంగా త‌మిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ‌గా సినిమాలు చేస్తున్నాడు.