ఆదికేశవా.. ఇలా ఉంటే కష్టం!
By: Tupaki Desk | 1 Nov 2023 1:30 AM GMTమెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా సక్సెస్ కు ఆ తర్వాత వచ్చిన ఫలితాలకు అసలు ఏమాత్రం సంబంధం లేదు. ఉప్పెన ఏకంగా 100 కోట్ల కు పైగా బిజినెస్ చేయడంతో హీరో రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే ఆ తర్వాత ఏ సినిమాలకు ఆ మ్యాజిక్ మాత్రం క్రియేట్ కాలేదు. కొండపొలం రాహు పాటు అంగరంగ వైభవంగా రెండు కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యాయి.
కొండపోలం సినిమా కంటెంట్ పరంగా కాస్త డిఫరెంట్ గానే ట్రై చేసినప్పటికీ అది ఈ తరం జనరేషన్ కి మాత్రం పెద్దగా ఎక్కలేదు. అయినప్పటికీ వైష్ణవ తేజ్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. రంగ రంగ వైభవంగా సినిమాతో యూత్ కు మరింత దగ్గర అవ్వాలి అని అనుకున్నప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు.
ఇక ఇప్పుడు కమర్షియల్ పాయింట్ లో మాస్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకోవాలి అని ఆదికేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ అయితే గట్టిగానే ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే త్రివిక్రమ్ ఫార్చూన్ ఫోర్ బ్యానర్ లో సినిమాను నిర్మించారు. ప్రొడక్షన్లో అయితే మంచి క్వాలిటీ ఉంటుంది అని పోస్టర్ టీజర్ ద్వారానే ఒక క్లారిటీ వచ్చేసింది.
కానీ సినిమా ప్రచార కంటెంట్ మాత్రం జనాల దృష్టిలో ఇంకా ఎక్కువ స్థాయిలో బజ్ క్రియేట్ చేయడం లేదు. అసలు సినిమా ఎందుకు చూడాలి అనే సందేహాలకు ఇంతవరకు సరైన ప్రచార కంటెంట్తో సమాధానం చెప్పలేదు. ఇక జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన మ్యూజిక్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు అనే అంటున్నారు . చెప్పుకోదగిన గ్లామరస్ అంశం ఏదైనా ఉంది అంటే అది శ్రీలీల బ్రాండింగ్ మాత్రమే.
ఇక ఈ సినిమా ఒక టెంపుల్ బ్యాక్ గ్రౌండ్లో రాబోతోంది. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి హీరోను ఒక మాస్ యాంగిల్ చూపించడమే కాకుండా విలేజ్ బ్యాక్ డ్రాప్ ను సెట్ చేసుకున్నట్లు టీజర్ తోనే హైలెట్ చేశారు. అయితే దీనిపై ఆచార్య తరహా కామెంట్స్ కూడా వచ్చాయి. సినిమా ఎప్పుడు విడుదల కావాల్సింది. కానీ అనేక రకాల కారణాలతో వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు.
ఒక మొత్తానికి ఇప్పుడు దీపావళి టైంలో హెవీ పోటీలోనే విడుదల చేస్తున్నారు. ఏదేమైనా కూడా హీరో వైష్ణవ తేజ్ సినిమా ప్రమోషన్స్ తో ఇంకా ఎక్కువగా హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే వరుస డిజాస్టర్ లిస్టు ఇంకా కొనసాగితే తదుపరి సినిమా మార్కెట్ విషయంలో ఇబ్బంది పడక తప్పదు. మరి వైష్ణవ రిలీజ్ సమయానికి చిత్ర యూనిట్ తో కలిసి ఏదైనా మ్యాజిక్ క్రియేట్ చేస్తాడా లేదా అనేది చూడాలి.