Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : బికినీ షో లో 'అహా'నా అదుర్స్‌

2013 లో టెలివిజన్ ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు ఈ పదేళ్ల కాలంలో పలు షార్ట్‌ ఫిల్మ్స్ లో నటించింది.

By:  Tupaki Desk   |   14 Jun 2024 4:45 AM GMT
పిక్ టాక్‌ : బికినీ షో లో అహానా అదుర్స్‌
X

అమితాబచ్చన్‌ తో కలిసి యుధ్‌ టెలివిజన్‌ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ఆహానా కుమ్రా. ఈ అమ్మడు హిందీ లో పలు షార్ట్‌ ఫిల్మ్‌ ల్లో నటించింది. అంతే కాకుండా పలు టీవీ సిరీస్ ల్లో మరియు వెబ్‌ సిరీస్ ల్లో కూడా ప్రస్తుతం ఈఅమ్మడు నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.


2013 లో టెలివిజన్ ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు ఈ పదేళ్ల కాలంలో పలు షార్ట్‌ ఫిల్మ్స్ లో నటించింది. కానీ హీరోయిన్ గా మాత్రం ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. దాంతో ఈ అమ్మడు ఒక అడుగు ముందుకు వేసి అందాల ప్రదర్శణ మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది.

ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ ఉంది. 1.6 మిలియన్‌ ల ఫాలోవర్స్ ను ఇన్‌స్టా లో కలిగి ఉన్న ఈ అమ్మడు తాజాగా బికినీ షో చేసింది. ఈ స్థాయిలో బికినీ షో చేయడం ద్వారా ముద్దుగుమ్మ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ మధ్య ఒక సినిమా లో ప్రధాన పాత్ర లో కనిపించిన ఈ అమ్మడికి ఆ సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. దాంతో టీవీ ఇండస్ట్రీలోనే బిజీ అవ్వాలని ఈ అమ్మడు భావించినట్లు ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉండే వారు కొందరు మాట్లాడటం జరిగింది.

2016 లో ప్రో కబడ్డీ సిరీస్ కు వ్యాఖ్యతగా వ్యవహరించడం తో పాటు పలు షో లకు యాంకరింగ్ చేసింది. ఆ మధ్య ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్ మూవీ లో ప్రియాంక గాంధీ పాత్ర లో నటించడం ద్వారా ఈ అమ్మడు అందరి దృష్టిని కర్షించింది. తాజా బికినీ ఫోటోలతో నెట్టింట వైరల్‌ అవుతోంది. ముందు ముందు ఈ అమ్మడు సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.