లైవ్ పెళ్లిలో డైరెక్టర్ కూతురికి పెదవి ముద్దు!
సెలబ్రిటీ పెళ్లిళ్లకు లావిష్‌నెస్ ని మించి హద్దులు మీరిన పాశ్చాత్యధోరణిని ఆపాదించడం ప్రజల్లో చాలా చర్చనీయాంశమైంది.
By: Tupaki Desk | 9 Dec 2024 6:09 PM GMTసెలబ్రిటీ పెళ్లిళ్లకు లావిష్‌నెస్ ని మించి హద్దులు మీరిన పాశ్చాత్యధోరణిని ఆపాదించడం ప్రజల్లో చాలా చర్చనీయాంశమైంది. ఇటీవల అంబానీల పెళ్లి వేడుకలు నెలల పాటు సాగాయి. పాశ్చాత్యులే మనల్ని చూసి నేర్చుకోవాలి అన్న తీరుగా సాగాయి. అదంతా అటుంచితే, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మెహందీ మొదలు ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో తారాతోరణం ఎంతో జాయ్ ఫుల్ గా కనిపించింది.
ఆలియా కశ్యప్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. విదేశీ యువకుడు షేన్ గ్రెగోయిర్ తో డేటింగ్ అనంతరం ఇప్పుడు ఆనందంగా పెళ్లి బంధంతో ఒకటవుతున్నారు. అనురాగ్ తన కుమార్తె ప్రేమను అంగీకరించడమే గాక వారి పెళ్లిని వైభవంగా జరిపిస్తున్నారు. అదంతా సరే కానీ.. ఈ ప్రీవెడ్డింగ్ ఫెస్టివల్స్ లో ఊహించని ఓ ఘటన ఇప్పుడు కొన్ని విమర్శలకు తావిచ్చింది.
పెళ్లి సంబరాల్లో వధూవరులు ఎంతో అందంగా ముచ్చటగా కనిపించారు. ఒకరికొకరు ఆప్యాయంగా మురిపెంగా కనిపించారు. పెళ్లిలో సయ్యాటలు చూపరులను కట్టిపడేసాయి. ఉన్నట్టుండి పూలతో తలంబ్రాలు పోసుకునే సమయంలో షేన్ గ్రెగోయిర్ తన సఖిని సన్నిహితంగా చూస్తూ ఎమోషనల్ అయ్యారు. తన కాబోయే భార్య ఆలియాను ప్రేమగా ముద్దాడేసారు. అలా పబ్లిగ్గా అతిథులందరి మధ్యా లిప్ లాక్ వేసేశాడు. ప్రస్తుతం ఈ క్లిప్స్ అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు, వీడియో చూసి పాశ్చాత్యం బాగా ముదిరింది! అంటూ నెటిజనులు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. భారతీయ సాంప్రదాయంలో ఇది తగదని కూడా కొందరు సూచించారు. ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు తీపి ముద్దు మధురం! అంటూ కొందరు సరదాగా పాడుకున్నా కానీ షేన్- ఆలియా జంట లవ్ చూశాక కొందరు స్ఫూర్తిని పొందామని తెలిపారు.