హీరోయిన్లకు చెంప చెల్లుమనే జవాబిచ్చిన హీరో
పారితోషికంలో పురుషాధిక్యత గురించి చాలా కాలంగా చర్చ ఉంది. అయితే దీనికి సరైన సమాధానం ఇచ్చిన ఏకైక హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.
By: Tupaki Desk | 30 Dec 2024 3:00 AM GMTబాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లో 100 కోట్లు పైగా పారితోషికాలు అందుకుంటున్న స్టార్లు ఉన్నారు. 200కోట్లు అంతకుమించిన పారితోషికం అందుకుంటున్న అరడజను మంది హీరోలు భారతదేశంలో ఉన్నారు. కానీ అగ్ర కథానాయికల పారితోషికాలు ఎప్పుడూ 20కోట్లకు మించి లేవు. ఎందుకింత వైవిధ్యం? సినీపరిశ్రమలో హీరోల డామినేషన్ కొనసాగుతోందా? మహిళా నటీమణులు మేల్ స్టార్లతో సమానంగా పారితోషికాలు అందుకునేందుకు అర్హులు కాదా?
దీపికా పదుకొనే, అలియా భట్, కంగనా రనౌత్, అనుష్క శర్మ, కరీనా కపూర్ ఖాన్ లాంటి సీనియర్ కథానాయికలు తమ ఛరిష్మాతో ప్రజల్ని థియేటర్లకు రప్పించగలరు. ఇటీవల వీరంతా సూపర్ ఉమెన్ పాత్రల్లో నటించేంతగా ఎదిగారు. స్పై థ్రిల్లర్లలో స్టార్ హీరోలకు ధీటుగా స్టంట్స్ చేస్తున్నారు. కానీ హీరోలతో సమానంగా పారితోషికాలు అందుకోలేకపోవడానికి కారణం? ఈ ప్రశ్నకు ఠకీమని సమాధానం చెప్పలేరు. పారితోషికంలో పురుషాధిక్యత గురించి చాలా కాలంగా చర్చ ఉంది. అయితే దీనికి సరైన సమాధానం ఇచ్చిన ఏకైక హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.
కరీనా కపూర్ ఖాన్, రాణి ముఖర్జీ లాంటి సీనియర్ స్టార్లు పాల్గొన్న ఒక రియాలిటీ షోలో మహిళా హోస్ట్ చాలా సీరియస్ గా వారితో పాటు ఉన్న అమీర్ ఖాన్ ని నిలదీసే ప్రయత్నం చేసింది. మేల్ స్టార్లతో సమానంగా కథానాయికలకు ఎందుకు పెద్ద పారితోషికాలు ఇవ్వరు? అని హోస్ట్ కాస్త పెద్ద స్వరంతోనే ప్రశ్నించింది. అయితే దానికి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ చాలా కూల్ గా జవాబిచ్చారు. హీరోయిన్లు చాలా కష్టపడుతున్నారు.. కాదనను.. మేమంతా శ్రమిస్తున్నాం. నేను కష్టపడుతున్నాను.. అలాగే లైట్ బాయ్ కూడా. అతడికి నా కంటే భిన్నంగా ఎందుకు చెల్లిస్తున్నారు? ఇక్కడ ఆడా మగా వ్యత్సాసం చూడకూడదు.. అని అమీర్ ఖాన్ అన్నారు.
మీరు సమస్యను గందరగోళానికి గురిచేస్తున్నారు. నాకు రూ. 10 చెల్లిస్తే నేను ఆ డబ్బుకు అదనంగా తిరిగి వెనక్కి తీసుకురాగలను. రాణి నా కంటే 101 శాతం ఎక్కువ సీట్లు(థియేటర్లలో) నింపగలిగితే, ఆమెకు నాకంటే ఎక్కువ జీతం ఇస్తారు. మార్కెట్ శక్తులు నా కంటే ఎక్కువ వేతనం పొందేలా చూస్తాయి! అని అమీర్ అన్నారు. ఆ సమయంలో రాణి ముఖర్జీ - కరీనా కపూర్ ఖాన్ అమీర్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. అసలు దీనిని ఆడా మగా అనే దృష్టితో చూడకూడదు. థియేటర్లకు ప్రజల్ని రప్పించే మన బలమే పారితోషికాన్నినిర్ణయిస్తుందని అమీర్ వివరణ ఇచ్చారు. సినిమా అనేది అవినీతి పని చేయని రంగం. నేను ప్రజలకు లంచం ఇచ్చి రండి, నా సినిమా చూడండి అని చెప్పలేనని అమీర్ ఖాన్ అన్నారు. అమీర్ తన తెలివైన సమాధానానికి ముగ్గురు మహిళలు ఎదురు ప్రశ్నించకుండా మౌనంగా అంగీకరించారు. ప్రస్తుతం ఈ త్రోబ్యాక్ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
అమీర్ ఖాన్ తదుపరి తారే జమీన్ పర్ సీక్వెల్ `సితారే జమీన్ పర్`లో కనిపించనున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ రాణి ముఖర్జీతో `మర్దానీ 3`ని ప్రకటించింది. కరీనా కపూర్ ఖాన్ తదుపరి `స్పిరిట్`లో నటించనుంది. సందీప్ వంగా తెరకెక్కించే ఈ చిత్రంలో ప్రభాస్, సైఫ్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు.