Begin typing your search above and press return to search.

ఆయ‌న వ‌స్తుంటే సూప‌ర్‌స్టార్లు లేచి నిల‌బ‌డ‌తారు

బిగ్ బి అమితాబ్ త‌మ క‌ళ్లెదుటే న‌డుస్తూ వ‌స్తుంటే తామంతా లేచి నిల‌బ‌డతామ‌ని, అది గౌర‌వ సూచిక అని అమీర్ అన్నారు.

By:  Tupaki Desk   |   12 Oct 2024 5:30 PM GMT
ఆయ‌న వ‌స్తుంటే సూప‌ర్‌స్టార్లు లేచి నిల‌బ‌డ‌తారు
X

కింగ్ ఖాన్ షారూఖ్ - అమీర్ ఖాన్- స‌ల్మాన్ ఖాన్ లాంటి దిగ్గ‌జాలు సీనియ‌ర్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ త‌మ క‌ళ్లెదుట‌ న‌డుచుకుంటూ వ‌స్తుంటే లేచి నిల‌బ‌డి చేతులు క‌ట్టుకుని నిల‌బడాలా? కానీ తామంతా ఆయ‌న ముందు లేచి నిల‌బ‌డ‌తామ‌ని అన్నారు మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్. బిగ్ బి అమితాబ్ త‌మ క‌ళ్లెదుటే న‌డుస్తూ వ‌స్తుంటే తామంతా లేచి నిల‌బ‌డతామ‌ని, అది గౌర‌వ సూచిక అని అమీర్ అన్నారు. ప్ర‌జ‌లంతా మేం (ఖాన్ ల త్ర‌యం) వ‌స్తుంటే లేచి నిల‌బ‌డ‌తారు.. గౌర‌విస్తారు. కానీ మేమంతా ఆయ‌న ముందు నిల‌బ‌డ‌తాము అని అన్నారు. టెలివిజ‌న్ రియాలిటీ షో 'కౌన్ బ‌నేగ క‌రోడ్ ప‌తి' షోకి త‌న‌యుడు జునైద్ తో క‌లిసి అటెండ‌యిన అమీర్ ఖాన్ పైవిధంగా స్పందించారు. భార‌త‌దేశంలో అతిపెద్ద స్టార్ ఎవ‌రు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా అమీర్ ఖాన్ పేరు వినిపిస్తుంది కానీ అత‌డు బిగ్ బి ముందు ఇంకెవ‌రూ పెద్ద స్టార్ కాదు అని అంగీక‌రించ‌డం అత‌డి విన‌మ్ర‌త‌ను సూచించింది.


ఇంత‌కుముందు ఆన్ లైన్ లో షేర్ అయిన ప్ర‌మోష‌న‌ల్ లింక్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. తాను అమితాబ్ బ‌చ్చ‌న్ కి అతి పెద్ద ఫ్యాన్ అని తెలిపారు. రియాలిటీ వేదిక‌పైకి ప్ర‌వేశించిన అమీర్ ఖాన్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆడియెన్ స‌మాధాన‌మిచ్చారు. నేను కిడ్ గా ఉన్న‌ప్పుడు ఎవ‌రు సూప‌ర్ స్టార్? అని ప్ర‌శ్నించ‌గా, ఆడియెన్ అమితాబ్ బ‌చ్చ‌న్ పేరు చెప్పారు. నేను ముస‌లివాడిని అయిపోయాను.. ఇప్పుడు కూడా ఎవ‌రు సూప‌ర్ స్టార్? అని ప్ర‌శ్నించ‌గా మ‌ళ్లీ అమితాబ్ బ‌చ్చ‌న్ అంటూ ప్ర‌జ‌లు క‌న్ఫామ్ చేసారు. అందుకే తాను కూడా అమితాబ్ కి అతిపెద్ద ఫ్యాన్ అని త‌న‌కు ఎప్ప‌టికీ అమితాబ్ బ‌చ్చ‌న్ - జ‌యాబ‌చ్చ‌న్ పెళ్లి రోజు గుర్తుంటుంద‌ని కూడా వ్యాఖ్యానించారు. వారి పెళ్లికి పంపిన ఆహ్వాన ప‌త్రిక గురించి అమీర్ ఖాన్ ప్ర‌స్థావించారు.

బిగ్ బి అమితాబ్ 82 ఏళ్ల వ‌య‌సులోను ఏడాదికి అర‌డ‌జ‌ను సినిమాల్లో న‌టిస్తూ నిరంత‌రం ప్ర‌క‌ట‌న‌ల ఆదాయాన్ని ఆర్జిస్తూ, సోష‌ల్ మీడియాల్లోను ఎంతో యాక్టివ్ మెంబ‌ర్ గా ఉన్నారు. బ్లాగులు రాస్తూ నేటిత‌రానికి స్ఫూర్తిని నింపుతున్నారు. న‌టుడిగా అత‌డు అల‌సిపోలేదు. అందుకే ఎప్ప‌టికీ భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో బిగ్గెస్ట్ సూప‌ర్ స్టార్ గా గౌరవం అందుకుంటున్నారు. ప్ర‌భాస్ న‌టించిన `క‌ల్కి 2989 ఏడి`లో అమితాబ్ అశ్వ‌త్థామ‌గా అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. క‌ల్కి ఉత్త‌రాదిన పెద్ద విజ‌యం సాధించ‌డంలో అమితాబ్ కీల‌క పాత్ర‌ను పోషించారు.