అమీర్ ఖాన్‌కి తమిళమ్మాయి ఎలా పడిపోయింది?
తన షష్ఠిపూర్తి (60వ పుట్టినరోజు)కి ఒక రోజు ముందు, సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఒక బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. చాలా కాలంగా తనపై వస్తున్న పుకార్లను నిజం చేసారు.
By: Tupaki Desk | 14 March 2025 11:46 AM ISTబాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఈరోజు షష్ఠిపూర్తి చేసుకుంటున్నారు. అతడి వయసు 60. ఈ వయసులో అతడు మూడో సారి ప్రేమలో పడ్డారని కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అతడి సీక్రెట్ డేటింగ్ గురించి హిందీ మీడియా చర్చిస్తూనే ఉంది. బెంగళూరుకు చెందిన ఓ యువతితో అమీర్ ఖాన్ నిండా ప్రేమలో ఉన్నాడని ప్రచారం సాగించింది. అయితే ఇవేవీ ఊహాగానాలు కావు. అన్ని ఊహాగానాలకు చెక్ పెడుతూ అమీర్ ఖాన్ ఇప్పుడు అధికారికంగా తన కాబోయే భార్య గురించి వెల్లడించారు.
తన షష్ఠిపూర్తి (60వ పుట్టినరోజు)కి ఒక రోజు ముందు, సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఒక బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. చాలా కాలంగా తనపై వస్తున్న పుకార్లను నిజం చేసారు. మార్చి 13 శుక్రవారం నాడు ఆమిర్ ఈ వార్తలను స్వయంగా ధృవీకరించాడు. తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను మీడియాకు పరిచయం చేశాడు. ఆమిర్ తన ఫోటోలు తీయొద్దని మీడియాను అభ్యర్థించాడు. అతడు తన కొత్త లేడీ లవ్ ని మీడియాకు పరిచయం చేసాడు.
గౌరీ స్ప్రాట్ ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? నేపథ్యం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.. అమీర్ ఖాన్ - గౌరీ స్ప్రాట్ సుమారు 25 సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాడు. సూపర్ స్టార్ గౌరీతో కూర్చుని మీడియా ప్రముఖులందరితో సంభాషించారు. గౌరీ బెంగళూరుకు చెందిన యువతి. ఆరు సంవత్సరాల బాలుడికి తల్లి. ఆమె అమీర్ ఖాన్ ఫిల్మ్స్‌లో పనిచేస్తుంది. ఆమె వృత్తిపరమైన నేపథ్యం హెయిర్‌డ్రెస్సర్. ఫ్యాషన్, స్టైలింగ్, ఫోటోగ్రఫీలో ఎఫ్‌డిఏ డిగ్రీ కూడా పూర్తి చేసారు. ఆమె లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో చదువుకుంది. గౌరీ తల్లి తమిళియన్.. ఆమె తండ్రి ఐరిష్. ఆమె తాతగారు స్వాతంత్య్ర సమరయోధుడు.
గౌరీతో ఒకటిన్నర సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నానని, తన కుటుంబానికి కొత్త స్నేహితురాలిని పరిచయం చేసానని కూడా వెల్లడించాడు. తన ప్రస్తుత స్నేహితురాలు లగాన్, దంగల్ వంటి కొన్ని సినిమాలను మాత్రమే చూసిందని ఆమీర్ తెలిపాడు. అమీర్ తన నివాసంలో సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్ , షారుఖ్ ఖాన్ లకు గౌరీని పరిచయం చేశాడు. ఇటీవల అమీర్ ఇంటి నుంచి వెళుతూ సల్మాన్, షారూఖ్ కనిపించారు.
అమీర్ ఖాన్ గతంలో రీనా దత్తా (1986-2002) ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు - ఇరా ఖాన్- జునైద్ ఖాన్. 2005 లో అతడు కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. ఈ జంట 2021 లో విడాకులు తీసుకున్నారు. వారికి జునైద్ అనే కుమారుడు ఉన్నాడు. జునైద్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే.