ఒక్కరోజు కూడా ఆడదన్నారు!
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కెరీర్లో లగాన్ సినిమాకు ఎంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉందో తెలిసిందే.
By: Tupaki Desk | 8 March 2025 11:47 AM ISTబాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కెరీర్లో లగాన్ సినిమాకు ఎంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉందో తెలిసిందే. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. లగాన్ సినిమా టైమ్ లో ఆమిర్ ఖాన్ వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. అప్పుడు తీస్తున్న లగాన్ కూడా ఫ్లాప్ అయితే అదే లాస్ట్ సినిమా అనే స్టేజ్ లోకి వచ్చేశారు.
సినిమా కథ నచ్చి, ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పటికీ ఆయన్ను చాలా మంది లగాన్ విషయంలో భయపెట్టారని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ తెలిపారు. ఏ ధైర్యంతో ఈ సినిమా చేస్తున్నావ్? ఎందుకు ఇలాంటి మూవీ తీస్తున్నావ్.. సినిమా ఒక్క రోజు కూడా ఆడదని అందరూ అన్నారని ఆమిర్ ఖాన్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.
దానికి తోడు ఆ రోజుల్లో అమితాబ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలన్నీ ఫ్లాపులయ్యేవనే సెంటిమెంట్ కూడా ఉండేదని, లగాన్ సినిమాకు అమితాబ్ వాయిస్ ఇచ్చారని, ఆ సెంటిమెంట్ తో లగాన్ కూడా ఫ్లాప్ అవుతుందన్నారని, క్రికెట్ బేస్డ్ సినిమాలు ఆ టైమ్ లో ఆడలేదని, లగాన్ మూవీ కూడా పోతుందని అందరూ అన్నారని, ఆ సినిమా చేసినన్ని రోజులు ఆ భయంతోనే చేసినట్టు ఆమిర్ ఖాన్ చెప్పారు.
కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని, హిట్ అవడమే కాకుండా ఆ టైమ్ లో లగాన్‌కు పలు అవార్డులు కూడా వచ్చాయని ఆమిర్ ఖాన్ తెలిపారు. బ్రిటీష్ వారితో స్థానికుంతా కలిసి క్రికెట్ ఆడి గెలిచి, ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందడమనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన లగాన్ కు ఏ ఆర్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా ఎంతో ప్లస్సయింది.
ఇక ఆమిర్ ఖాన్ సినిమాల విషయానికొస్తే ఆయన నుంచి హిట్ సినిమా వచ్చి చాలా రోజులవుతుంది. ఆయన్నుంచి పీకే, దంగల్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ సినిమాలు వచ్చింది లేదు. మొన్నామధ్యన వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్, లాల్ సింగ్ చద్దా సినిమాలు డిజాస్టర్లవగా, ఇప్పుడు ఆమిర్ 1947 నేపథ్యంలో మరో ప్రయోగానికి రెడీ అయ్యారు. ఇదిలా ఉంటే ఆమిర్ 60వ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయించుకుని ఆయన నటించిన పలు హిట్ సినిమాలను థియేటర్లలో స్పెషల్ షోలు వేయనుంది.