Begin typing your search above and press return to search.

మేన‌ల్లుడితో స్టార్ హీరో మ‌రోటి ఫిక్స్ చేసాడు!

మేన‌ల్లుడు ఇమ్రాన్ ఖాన్ కంబ్యాక్ బాధ్య‌తలు మేన మామ అమీర్ ఖాన్ తీసుకున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   14 Sep 2024 6:52 AM GMT
మేన‌ల్లుడితో స్టార్ హీరో మ‌రోటి ఫిక్స్ చేసాడు!
X

మేన‌ల్లుడు ఇమ్రాన్ ఖాన్ కంబ్యాక్ బాధ్య‌తలు మేన మామ అమీర్ ఖాన్ తీసుకున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇమ్రాన్ న‌టుడిగా ఎంతో ఫేమ‌స్. కానీ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్నాడు. మాన‌సికంగా ఎంతో వేద‌న‌కి గుర‌య్యాడు. ఇప్పుడిప్పుడే వాటి నుంచి బ‌య‌ట ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో అమీర్ ఖాన్ ...మేన‌ల్లుడికి అండ‌గా నిల‌బ‌డ్డాడు.


అమీర్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ‌లో కంబ్యాక్ మూవీ నిర్మించ‌డానికి ఇప్ప‌టికే స‌న్నాహాలు మొద‌లు పెట్టారు. ఈ సినిమాతో స్టాండ‌ప్ కమెడియ‌న్ , న‌టుడు వీర్ దాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ వుతున్నాడు. `హ్యారీ ప‌టేల్` అనేది సినిమా టైటిల్. ఇదొక కామెడీ ఎంట‌ర్ టైన‌ర్. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే అల్లుడితో రెండ‌వ సినిమా కూడా నిర్మించ‌డానికి అమీర్ ముందుకొచ్చారు. `

`బ్రేక్ కే బాద్` ద‌ర్శ‌కుడు డానిష్ అస్లాంతో ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా నేప‌థ్యంతో తెర‌కెక్కిస్తున్నారుట‌. అయితే ఈ చిత్రాన్ని మాత్రం థియేట‌ర్లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాల‌ని అమీర్ ప్లాన్ చేస్తున్నారుట‌. దీంతో అమీర్ నిర్మాణ సంస్థ నుంచి ఓటీటీలో రిలీజ్ అవుతోన్న తొలి సినిమా ఇదేన‌ని తెలుస్తోంది. ఇంత‌వ‌ర‌కూ అమీర్ ఖాన్ ఎన్నో సినిమాలు నిర్మించారు.

ఆయన హీరోగా కొన్ని సినిమాలు..ఇత‌ర హీరోల‌తో మ‌రికొన్ని చిత్రాలు చేసారు. వాట‌న్నింటిని థియేట‌ర్లోనే రిలీజ్ చేసారు. కానీ ఇప్పుడా ప‌ద్ద‌తి నుంచి బ‌య‌ట‌కొచ్చిన‌ట్లు తెలుస్తోంది. కంటెంట్ బేస్డ్ చిత్రాల‌కు థియేట‌ర్ కంటే ఓటీటీలో నే మంచి విజయం సాధిస్తున్న సంగ‌తి తెలిసిందే. థియేట‌ర్ ని మించి మార్కెట్ ఓటీటీ లో క‌నిపిస్తుంది.