Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కి ఆయ‌నంటే అంత ఇష్ట‌మా?

మెగాస్టార్ చిరంజీవికి బాలీవుడ్ న‌టుడు మిస్ట‌ర్ ప‌ర్పెక్ట్నిస్ట్ అమీర్ ఖాన్ అంటే? ఎంత ఇష్ట‌మో నిన్న‌టి రోజున బ‌య‌ట‌ప‌డింది.

By:  Tupaki Desk   |   23 Sep 2024 9:30 AM GMT
మెగాస్టార్ కి ఆయ‌నంటే అంత ఇష్ట‌మా?
X

మెగాస్టార్ చిరంజీవికి బాలీవుడ్ న‌టుడు మిస్ట‌ర్ ప‌ర్పెక్ట్నిస్ట్ అమీర్ ఖాన్ అంటే? ఎంత ఇష్ట‌మో నిన్న‌టి రోజున బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌ఖ్యాత గిన్సీస్ బ‌క్ ఆఫ్ రికార్డును అమీర్ చేతుల మీదుగా చిరంజీవి అందుకో వ‌డంతో ఇది రుజువైంది. గిన్సీస్ బుక్ ప్ర‌తినిధి రిచ‌ర్డ్ తో క‌లిసి అమీర్ ఖాన్ చిరంజీవికి ఈ అరుదైన గౌర‌వా న్ని అందించారు. చిరంజీవి ఒక్క ఫోన్ కాల్..చిన్న మెసెస్ అమీర్ కి పంపించే స‌రికి ఆయ‌న వెంట‌నే ముంబై నుంచి హైద‌రాబాద్ కి వ‌చ్చారు.

ఇలా చిరంజీవికి ప్ర‌దానం చేయ‌డం అమీర్ ఓ గొప్ప గౌర‌వంగా భావించిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి ఎప్పుడైనా త‌న‌ని అడ‌గ‌కూడ‌ద‌ని...ఆదేశించాల‌ని త‌న మ‌న‌సులో మాట‌ను అమీర్ బ‌య‌ట పెట్టారు. ఈ మాట‌ల‌తో అమీర్ మ‌న‌సులో చిరంజీవి స్థానం ఎంత గొప్ప‌ద‌న్న‌ది అద్దం ప‌ట్టింది. అంతేనా? చిరంజీవిని తాను అన్న‌య్య‌లా భావిస్తాన‌ని...చిరుకి పెద్ద అభిమానిగాను అమీర్ నోట అన‌డం మెగా అభిమానుల్లో ఆనందాన్నిరెట్టింపు చేసింది.

వేదిక వ‌ద్ద చాలా మందిలో కంట నీళ్లు తిరిగాయి. ఎంత గొప్ప అనుబంధం లేక‌పోతే అమీర్ అలా అన‌గ‌ల‌రు. చిరంజీవి-అమీర్ మ‌ధ్య 10 ఏళ్లు వ‌య‌సు వ్య‌త్యాసం ఉంది. అమీర్ కంటే చిరంజీవి ప‌దేళ్లు పెద్ద. చిరంజీవి వ‌య‌సు 69 కాగా..అమీర్ ఖాన్ వ‌య‌సు 59. అందుకే ఆయ‌న్ని అన్న‌య్య‌గా అమీర్ భావించారు. మ‌రి బాలీవుడ్ లో అంత మంది న‌టులు ఉండ‌గా? అమీర్ ఖాన్ నే చిరంజీవి ఎందుకు ఎంపిక చేసుకున్నారు. అంటే చిరంజీవి మ‌న‌సులో అమీర్ స్థానం ఎంత గొప్ప‌ద‌న్న‌ది ఆ ఎంపిక‌నే చెబుతుంది.

భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది సీనియ‌ర్ న‌టులున్నారు. కానీ ఎవ‌రికీ ద‌క్క‌ని అవ‌కాశం అమీర్ కి ద‌క్కింది. ఇక న‌టుడిగా అమీర్ చేసిన సినిమాలు చిరంజీవి మ‌న‌సులో గొప్ప స్థానంలో కూర్చోబెట్టాయి అన్న‌ది అంతే వాస్త‌వం. వెండి తెర‌పై అమీర్ ప్ర‌యోగాలు అన్నీ ఇన్నీ కావు. అందులో అమీర్ ఓ ఎన్ సైక్లోపీడియా. ఇక వ్య‌క్తిగ‌తంగా చిరంజీవి-అమీర్ మ‌ధ్య మంచి బాండింగ్ ఉంది. అది ఎంత బ‌లంగా ఉంది? అన్న‌ది నిన్న‌టితో మ‌రోసారి రుజువైంది.