స్టార్ హీరో బెంగళూరుకు దొంగ పిల్లిలా..!
తన షష్ఠిపూర్తి వేళ మూడో వివాహానికి సిద్ధమైన అమీర్ ఖాన్ సంచలనంగా మారాడు. అతడు తన వ్యక్తిగత జీవితం గురించి ఒక పెద్ద విషయాన్ని వెల్లడించాడు.
By: Tupaki Desk | 16 March 2025 6:00 AM ISTతన షష్ఠిపూర్తి వేళ మూడో వివాహానికి సిద్ధమైన అమీర్ ఖాన్ సంచలనంగా మారాడు. అతడు తన వ్యక్తిగత జీవితం గురించి ఒక పెద్ద విషయాన్ని వెల్లడించాడు. తాను చాలా కాలంగా తన కంపెనీలోనే పని చేస్తున్న గౌరీ స్ప్రాట్ అనే యువతితో డేటింగ్ చేస్తున్నానని వెల్లడించి పెద్ద షాకిచ్చాడు. గత 25 సంవత్సరాలుగా వారు ఒకరికొకరు తెలుసు. గత 18 నెలలుగా వారు డేటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అది ఓపెనవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇంత పెద్ద రహస్యాన్ని ఎలా దాచి ఉంచగలిగారు? అని ప్రశ్నిస్తే...అమీర్ చాలా సరదాగా స్పందించాడు. ఆమె బెంగళూరులో నివసిస్తుంది.. మొన్నటి వరకు అక్కడే నివసించింది. కాబట్టి నేను ఆమెను కలవడానికి విమానంలో వెళ్లేవాడిని. మీడియా దృష్టి నాపై అక్కడ తక్కువగా ఉంది. కాబట్టి మేం ఎవరికీ చిక్కలేదు`` అని అన్నాడు.
కుటుంబానికి తెలియకుండా ఎలా దాచారు? అని ప్రశ్నించగా... నా ఇంటిపై అంతగా ఇతరుల దృష్టి లేదు..మీకు తెలియనివి ఉన్నాయి! అని సమాధానమిచ్చాడు. గౌరీ స్ప్రాట్‌తో తన సంబంధంలో తాను చాలా సురక్షితంగా ఉన్నానని ఖాన్ పేర్కొన్నాడు. అందుకే దానిని ఓపెన్ గా చెప్పాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. మేం ఇప్పుడు నిబద్ధతతో ఉన్నాము. ఒకరికొకరు తగినంత సురక్షితంగా ఉన్నాము. ఇది మంచి సమయం. నేను ఇప్పుడు ఎలాంటి విషయాలను దాచాల్సిన అవసరం లేదు! అని అమీర్ అన్నారు. తన మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు సహా తన కుటుంబం కూడా గౌరీని కలిశారని ఆమిర్ వెల్లడించాడు. తాజాగా ఇర్పాన్ పఠాన్ వివాహవార్షికోత్సవ వేడుకలో తన ముగ్గురు భార్యలతో కలిసి అమీర్ ఖాన్ కనిపించడం ఆశ్చర్యపరిచింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఆమిర్ తదుపరి ఆర్.ఎస్. ప్రసన్న `సితారే జమీన్ పర్`లో కనిపించనున్నారు. జెనీలియా డిసౌజా ఇందులో ఓ కీలక పాత్రధారి. ఈ చిత్రం 2025 ద్వితీయార్థంలో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.