షారుక్ -సల్మాన్ ఖాన్ పై అమీర్ ఖాన్ సంచలన ఆరోపణ!
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ హీరోగా నితీష్ తివారీ తెరకెక్కించిన` దంగల్` ఎలాంటి విజయం సాధిం చిందో తెలిసిందే.
By: Tupaki Desk | 25 March 2025 8:00 PM ISTబాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ హీరోగా నితీష్ తివారీ తెరకెక్కించిన` దంగల్` ఎలాంటి విజయం సాధిం చిందో తెలిసిందే. భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా `దంగల్` నిలిచింది. 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రమిది. ఇప్పటికీ ఆ రికార్డు అంతే పదిలంగా ఉంది. `బాహుబలి`, `పుష్ప-2` లాంటి చిత్రాలు దంగల్ రికార్డును బీట్ చేస్తాయనుకున్నారు? కానీ సాధ్యపడలేదు.
ఆ రకంగా అమీర్ ఖాన్ కెరీర్ లో గొప్ప మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. అమీర్ ఖాన్ బాలీవుడ్ చిత్రాల గురించి చెప్పాల్సి వస్తే దంగల్ కు ముందు...తర్వాత అని కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈసినిమాని ఉద్దేశించి అమీర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈసినిమా లో నటించడం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదని వెల్లడించారు. తన కెరీర్ ని ముగించాలనే ఉద్దేశంతో షారుక్ ఖాన్..సల్మాన్ ఖాన్ ఇలా దంగల్ తో పన్నాగం పన్ని దంగల్ కథను తన వద్దకు వచ్చేలా చేసారని నవ్వుతూ వ్యాఖ్యానించారు.
`దంగల్` లో అమీర్ ఖాన్ ఇద్దరు కుమార్తెల తండ్రి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వయసు మళ్లిన అమీర్ ఖాన్ గానూ ఇందులో కనిపిస్తారు. కుస్తీలో తాను సాధించలేనిది కుమార్తె ద్వారా సాధించాలనే పట్టుదలతో కుమార్తెలిద్దర్నీ అథ్లెట్ గా ఎలా తయారు చేసారు? అన్నది ఆసక్తికరం. ఇదంతా మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా నితీష్ తివారీ తెరకెక్కించారు.
అమీర్ ఖాన్ వ్యాఖ్యల్ని బట్టి తొలుత మహావీర్ సింగ్ ఫోగట్ ప్రాత్ర కోసం నితీష్ తివారి షారుక్ ఖాన్ ...సల్మా న్ ఖాన్ లను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఆ పాత్రకు అమీర్ ఖాన్ అయితే బాగుంటుందని సూచించడంతో అమీర్ వద్దకు ఆ స్క్రిప్ట్ వచ్చింది. అలా దంగల్ కార్య రూపం దాల్చింది. రోబో చిత్రాన్ని కూడా శంకర్ తొలుత కమల్ హాసన్ తో తీయాలనుకున్నారు. కానీ కమల్ ఆ కథకు..పాత్రకు తనకంటే రజనీకాంత్ బాగుంటారని సూచించడంతో? అందులోకి రజనీ వచ్చారు.