Begin typing your search above and press return to search.

ఆటో ఎక్కి డ్రైవ‌ర్‌కి అలా షాకిచ్చిన సూప‌ర్‌స్టార్ కొడుకు

బాలీవుడ్‌లో ఖాన్ ల త్ర‌యంలో సంచ‌లన హీరోగా అమీర్ ఖాన్ గురించి నిరంత‌రం చ‌ర్చ జ‌రుగుతుంది.

By:  Tupaki Desk   |   7 Feb 2025 3:35 AM GMT
ఆటో ఎక్కి డ్రైవ‌ర్‌కి అలా షాకిచ్చిన సూప‌ర్‌స్టార్ కొడుకు
X

బాలీవుడ్‌లో ఖాన్ ల త్ర‌యంలో సంచ‌లన హీరోగా అమీర్ ఖాన్ గురించి నిరంత‌రం చ‌ర్చ జ‌రుగుతుంది. అత‌డు ఓ సినిమాలో న‌టిస్తున్నాడు! అంటే ప్ర‌పంచం దృష్టి అటువైపే ఉంటుంది. అమీర్ ఖాన్ ఈసారి తెర‌పైకి ఎలాంటి కొత్త‌దనాన్ని తెస్తున్నాడో చూడాల‌ని ఆశిస్తారు. బాలీవుడ్ లో ప‌రిమిత సినిమాల్లో న‌టించి, భారీ క‌లెక్ష‌న్స్ సాధించిన హీరోగాను అమీర్ కి రికార్డ్ ఉంది. ఇండియా స‌హా చైనా, జ‌పాన్ ఇత‌ర దేశాల్లో అత‌డికి ఉన్న ఫాలోయింగ్ అసాధార‌ణ‌మైన‌ది.

అందుకే అంత పెద్ద స్టార్ వార‌సుడి డెబ్యూ సినిమా వ‌స్తోంది అంటే స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంటుంది. కానీ అమీర్ ఖాన్ న‌ట‌వార‌సుడు జునైద్ ఖాన్ వెండితెర‌కు ప‌రిచ‌యం అవుతున్నా కానీ, ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. అత‌డు న‌టించిన `ల‌వ్ యాపా` ఈ శుక్ర‌వారం రిలీజ‌వుతుండ‌గా, దీనికి `బుక్ మై షో`లో క‌నీసం 2000 టికెట్లు అయినా తెగ‌క‌పోవ‌డంతో మ‌రీ ఇంత దారుణ‌మా? అంటూ నెటిజ‌నులు వ్యాఖ్యానిస్తున్నారు.

అదంతా స‌రే కానీ.. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తాను ఓసారి ఆటో ఎక్కి వ‌స్తుండ‌గా, ఓ సిగ్న‌ల్ ద‌గ్గ‌ర జ‌రిగిన సంఘ‌ట‌న‌ను తాజా ప్ర‌మోష‌న్స్ లో గుర్తు చేసుకున్నాడు. జునైద్ ఆటో రిక్షాలో ప్ర‌యాణించ‌డం తనకు ఎప్పుడూ సమస్య కాదని, ఎందుకంటే త‌న‌ను ఎవ‌రూ అంత‌గా గుర్తించ‌ర‌ని పేర్కొన్నాడు.

నేను ప్రతిరోజూ ఆటోలో వెళుతుంటాను. ఒక్కసారి మాత్రమే వాళ్ళు నన్ను గుర్తుపట్టారని పాత సంఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నాడు. ఓసారి అంధేరి నుండి బాంద్రాకు ఆటోరిక్షాలో ప్రయాణిస్తున్నప్పుడు తన తండ్రి అమీర్ ఖాన్ ఆగి ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జునైద్ ఆటో ఆగింది. జునైద్‌ను చూసి, ఆమిర్ తన కారు కిటికీని దించి `హాయ్ పాపా` అని పలకరించాడు. ఆటో డ్రైవర్ దిగ్భ్రాంతి చెందాడు. ఈ ఆ ఇద్ద‌రూ మాట్లాడుకోవ‌డం చూసి ఆశ్చర్యపోయిన డ్రైవర్, జునైద్‌ను అమీర్ ఖాన్ తెలుసా? అని అడిగాడు. దానికి జునైద్ సరదాగా, మేం ఒకే ప్రాంతంలో నివసిస్తున్నామ‌ని, బెనారస్‌లో ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉంద‌ని అత‌డికి చెప్పాడట‌. నిజానికి జునైద్ ఖాన్ ఎవ‌రో అత‌డి మొద‌టి సినిమా రిలీజ్ వ‌ర‌కూ పెద్ద‌గా తెలియ‌దు. `మ‌హారాజా` రిలీజ‌య్యాక మీడియా ఇంట‌ర్వ్యూల‌తో కొంత బ‌య‌ట పాపుల‌ర‌య్యాడు. ఇప్పుడు `ల‌వ్ యాపా` కార‌ణంగా బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసాడు. అయితే అమీర్ ఖాన్ కి ఉన్న క్రేజ్ అత‌డికి రావ‌డం అంత సులువు కాద‌ని ఇప్ప‌టికే అర్థ‌మైంది.

ఇదే చిట్ చాట్ లో ఖుషిక‌పూర్ మాట్లాడుతూ.. తాను ఆటో ఎక్క‌డం త‌న త‌ల్లిదండ్రుల‌కు అస్స‌లు న‌చ్చ‌ద‌ని, అది దాదాపు ఇంట్లో నిషేధ‌మ‌ని ఖుషిక‌పూర్ చెప్పింది. అయితే తాను కాలేజ్ క్యాంప‌స్ నుంచి ప్ర‌యాణించేప్పుడు మాత్ర‌మే ఆటోలో వెళ్లాన‌ని ఖుషి తెలిపింది.

అద్వైత్ చందన్ `లవ్ యాప్ప‌` చిత్రానికి దర్శకత్వం వహించారు. జునైద్ ఖాన్, ఖుషిక‌పూర్, అశుతోష్ రాణా, తన్వికా పర్లికర్, కికు శారద, దేవిషి మందన్, ఆదిత్య కులశ్రేష్ఠ్ , నిఖిల్ మెహతా త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలోకి విడుద‌లైంది.