20 ఏళ్లుగా పారితోషికం లేకుండానే.. స్టార్ హీరో చెప్పింది విన్నారా?
తారే జమీన్ పర్ సినిమాకి ఈ మోడల్ ని అనుసరించానని అమీర్ అన్నారు.
By: Tupaki Desk | 25 Feb 2025 4:12 AM GMTఇటీవల 100 కోట్లు అంతకుమించి పారితోషికం అందుకునే హీరోల గురించి ఎక్కువగా చర్చ సాగుతోంది. పాన్ ఇండియా ట్రెండ్ లో స్టార్ హీరోలు 100 కోట్ల పారితోషికం, దాంతో పాటే లాభాల్లో వాటాలు అందుకుంటున్నారని కథనాలొచ్చాయి. అల్లు అర్జున్, దళపతి విజయ్ సుమారు 250కోట్లు పైగా వసూలు చేస్తున్నారని కూడా కథనాలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఖాన్ ల త్రయంలో ప్రముఖుడు అమీర్ ఖాన్ తాను కేవలం లాభాల్లో వాటా మాత్రమే తీసుకుంటానని, పారితోషికం తీసుకోనని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. దానివల్ల కేవలం 10-20 కోట్లలోనే సినిమాలు తీసేయగలమని కూడా అన్నారు. తారే జమీన్ పర్ సినిమాకి ఈ మోడల్ ని అనుసరించానని అమీర్ అన్నారు.
నిజానికి స్టార్లు లాభాల్లో వాటాలు పంచుకునే నమూనా(మోడల్) ఆచరణీయమైనదనే విశ్లేషణ ట్రేడ్ లో ఉంది. సినిమా అనేది కళ, వ్యాపారం రెండిటి కలయిక. అందువల్ల స్టార్లు కళారంగానికి అండగా ఉండాలంటే నిర్మాతకు బర్డెన్ గా మారకూడదు. లాభం వచ్చినా నష్టం వచ్చినా అందులో షేర్ తీసుకునేవాడిగా హీరో ఉండాలి. తాజాగా ఏబీపీ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ పారితోషికం మ్యాటర్ గురించి మాట్లాడారు.
తనకు సూపర్‌స్టార్‌డమ్ ఉన్నా కానీ, తారే జమీన్ పర్ వంటి ప్రయోగాత్మక చిత్రాలను చేయగలగడానికి కారణాలను వెల్లడించారు. డిస్లెక్సియాపై ఎవరైనా సినిమా ఎందుకు చూడాలి? అంటూ తనను వ్యతిరేకించి, విమర్శించిన వారు ఉన్నాయని అమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు. ``కానీ నాకు ఈ కథ చాలా నచ్చింది. నేను కూడా చాలా ఏడ్చాను. నేను ఈ సినిమా తీయాలనుకున్నాను. నాకు నిజంగా అనుకూలించేది బడ్జెట్‌లో నా ఫీజు భారం వేయకపోవడమే. నా సినిమాలు రూ. 10-20 కోట్లలో పూర్తి అవుతాయి.. ఎలాగైనా అంత డబ్బు సంపాదిస్తాయి`` అని అమీర్ అన్నారు. లాభాలను షేర్ చేసుకునే మోడల్ ద్వారా తాను పారితోషికం సంపాదిస్తానని అన్నారు. ఇది నాటి తరం కళాకారులు డబ్బు సంపాదించే పద్ధతి లాంటిది. వారు రోడ్లపై ప్రదర్శనలు ఇచ్చేవారు. టోపీని పైకి ఎత్తి చూపుతూ ప్రేక్షకుల నుండి డబ్బు వసూలు చేసేవారు. వారికి నచ్చితే తమకు తగిన పైసా ఇవ్వవచ్చు. వారికి నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా, నా సినిమా నడుస్తుంటే నేను సంపాదిస్తాను. సినిమా నడవకపోతే సంపాదించను`` అని ఆమిర్ అన్నారు. ఈ మోడల్‌ను తాను ఇరవై సంవత్సరాలకు పైగా అనుసరిస్తున్నానని వెల్లడించారు.
త్రి ఇడియట్స్ మీకు నచ్చి ఇతరులకు చెప్పగా వారంతా థియేటర్లకు వచ్చి చూశారు. ఆ సినిమా లాభాల నుంచి నాకు వాటా వచ్చింది. మొదట నా సంపాదన సినిమా ప్రశంసలు పొందడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై మాత్రమే ఆధారపడి ఉంటుందని అమీర్ అన్నారు. ఒక మోడల్ ఆధారంగా చేసే సినిమాల కోసం నాకు స్వేచ్ఛగా పని చేసే అవకాశం లభించిందని అమీర్ ఖాన్ అన్నారు. ఖర్చు భారం ఉండదు.. బడ్జెట్‌లు పెరగవలసిన అవసరం లేదు అని అన్నారు.
అద్వైత్ చందన్ చిత్రం `లాల్ సింగ్ చద్దా` ఫ్లాపయ్యాక రెండువారాలు కోలుకోలేకపోయానని అమీర్ ఖాన్ వెల్లడించారు. ప్రస్తుతం అతడు ఆర్.ఎస్. ప్రసన్నతో కలిసి `సీతారే జమీన్ పర్` చిత్రం కోసం పనిచేస్తున్నాడు రజనీకాంత్ కూలీలోను అమీర్ అతిథి పాత్రలో నటిస్తున్నారని సమాచారం.