మరో 10 ఏళ్లు డోఖా లేకుండా నటిస్తా.. స్టార్ హీరో
ఈ పరిశ్రమలో చాలామంది జంటలు విడిపోయినా తిరిగి కలుస్తున్నారు.
By: Tupaki Desk | 13 Nov 2024 2:45 AM GMTఇటీవలి కాలంలో సెలబ్రిటీ జంటలు విడిపోయి కలిసి ఉండడం ట్రెండింగ్ గా మారింది. విడాకులు ప్రకటించాక కూడా ఎంతో పరిణతితో ఒకరికొకరు పర్పస్ ఫుల్‌గా కలుస్తున్నారు. ముఖ్యంగా తమ పిల్లల గురించి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పిల్లల కోసం జీవించడాన్ని అలవరుచుకుంటున్నారు. ఇది బాలీవుడ్ లో నయా ట్రెండ్. ఈ పరిశ్రమలో చాలామంది జంటలు విడిపోయినా తిరిగి కలుస్తున్నారు. స్నేహంగా ఉంటున్నారు.
అమీర్ ఖాన్ - కిరణ్ రావ్ విడాకుల అనంతరం పరిణతి ఎప్పుడూ హాట్ టాపిక్. తమ విడాకుల గురించి తాజా ఇంటర్వ్యూలో అమీర్ మాట్లాడుతూ తమ మధ్య విభేధాల గురించి ప్రస్థావించారు. విడిపోవడం వృత్తిపరంగా లేదా వ్యక్తిగతంగా తమ సంబంధాన్ని ప్రభావితం చేయలేదని అమీర్ చెప్పాడు! అమీర్ -కిరణ్ రావు జంట వారి కుమారుడు ఆజాద్ రావ్ ఖాన్ కి సహ తల్లిదండ్రులుగా ఉన్నారు. 2005లో కిరణ్ రావ్‌ను అమీర్ వివాహం చేసుకున్నారు. 16ఏళ్ల ఆదర్శ జీవనం తర్వాత వారు 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అంతకుముందు అమీర్ నటి రీనా దత్‌ను వివాహం చేసుకోగా అది బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. ఈ జంటకు కుమార్తె ఇరా ఉన్నారు.
ఇటీవలి ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాతో అమీర్ మాట్లాడారు. ``విడాకులు మా సంబంధాన్ని ప్రభావితం చేయలేదు.. వృత్తిపరంగా లేదా వ్యక్తిగతంగా ప్రభావం చూపలేదు. విడాకులు అనేది మీరు వెళ్లిపోతున్నారని సూచించే పదం.. మేము భార్యాభర్తలుగా దూరమవుతున్నాము`` అన్నారు. ఈ చాట్‌లో కిరణ్ కూడా అమీర్‌తో పాటు ఉన్నారు. ఈ జోడీ ఒకరికొకరు వృత్తిపరమైన సహకారం, సృజనాత్మక బంధం గురించి కూడా మాట్లాడారు. విడాకులు అనేది ఒక ప్రత్యేక అంశం. సృజనాత్మక వ్యక్తులుగా కలిసి మెలిసి పని చేయడాన్ని ఆస్వాధిస్తాం.
మేం ఒకరి మనస్సును ఒకరు ఇష్టపడతాము. అందుకే మేం చాలా బాగా కలిసి పని చేస్తాము. మా సెన్సిబిలిటీలు సమానంగా ఉంటాయి అని కిరణ్ రావు అన్నారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తాము. ఈ భాగస్వామ్యం కొనసాగడానికి ఇది ఒక కారణమని నేను భావిస్తున్నాను అని ఆమె అన్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... అమీర్ ఖాన్ సుదీర్ఘ విరామం తర్వాత `సితారే జమీన్ పర్`లో కనిపించనున్నారు. లాల్ సింగ్ చద్దా అనూహ్యంగా ఫెయిలయ్యాక అతడు తిరిగి ఒక బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ తో తిరిగి వస్తున్నారు.
పదేళ్లు గ్యారెంటీగా ...
తాజా ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. తాను మరో పదేళ్లు చురుగ్గా పని చేయగలనని, కెరీర్ ని మరింత ఉత్తమంగా ముందుకు తీసుకెళతానని వ్యాఖ్యానించారు. అందుకే తన నిర్మాణ సంస్థ బాధ్యతలను యువకులైన అపర్ణ పురోహిత్ కి అప్పగించానని కూడా తెలిపారు. యువనటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులకు అవకాశాలు కల్పిస్తానని అమీర్ తాజా ఇంటర్వ్యూలో అన్నారు. 59 వయసులోను అమీర్ కాన్ఫిడెన్స్ నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. అతడు 70 సంవత్సరాల వయసు వరకూ ఇప్పటిలానే నటిస్తాననే ధీమాతో ఉండడం ఆసక్తికరం.