30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇద్దరు మెగాస్టార్లు!
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కానీ ఆ కాంబినేషన్ మళ్లీ చేతులు కలపలేదు.
By: Tupaki Desk | 23 Aug 2024 3:30 PM GMTబాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాల హవా ఒకప్పుడు ఓరేంజ్ లో ఉండేది. ఖాన్ లు..కపూర్ లు అంతా కలిసి ఒకే సినిమాలో కనిపించేవారు. అయితే కాలక్రమంలో కొన్ని రకాల సమీకరణాలు ట్రెండ్ ని కాస్త దూరం చేసాయి. సీనియర్ హీరోలు కలిసి పనిచేయడం అన్నది తగ్గింది. 30 ఏళ్ల క్రితమే సల్మాన్ ఖాన్-అమీర్ ఖాన్ కలిసి `అందాజ్ అప్నా అప్నా` అనే సినిమాలో కలిసి నటించారు. 1994 లో రిలీజ్ అయిన సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది.
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కానీ ఆ కాంబినేషన్ మళ్లీ చేతులు కలపలేదు. ఎవరికి వారు స్వతంత్రంగా సినిమాలు చేసుకున్నారు తప్ప! మళ్లీ కలిసి చేసే ప్రయత్నం చేయలేదు. అయితే అందుకిప్పుడు సమయం ఆసన్నమైంది. 30 ఏళ్ల తర్వాత ఈ ద్వయం మళ్లీ మరోసారి కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. సల్మాన్ ఖాన్ 14 ఏళ్ల కిందట పోస్ట్ చేసిన పోస్ట్ కి అమీర్ ఇప్పుడు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.
2010 లో సల్మాన్ `అమీర్ తో కలిసి నటించే అవకాశం మళ్లీ రాలేదు. మళ్లీ ఆ రోజులు ఎప్పుడు వస్తాయో` అంటూ సల్మాన్ అప్పట్లో ఓ పోస్ట్ పెట్టారు. తాజాగా అమీర్ ప్రొడక్షన్స్ దాన్ని రీ ట్వీట్ చేసింది. దీంతో అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. ఇద్దరు మళ్లీ కలవడానికి ఎంతో సమయం పట్టదంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు.
మరి ఆ కాంబోని కలపడం అంటే చిన్న విషయం కాదు. ఇద్దరి ఇమేజ్ కి తగ్గ స్టోరీ కావాలి. వాళ్లని డీల్ చేసే అనుభవం గల దర్శకుడు కావాలి. నిర్మాణ సంస్థలది ఏముంది? వాళ్లిద్దరు ఒకే చెప్పాలిగానీ వందల కోట్లు గుమ్మరించడానికి ఎన్నో సంస్థలొస్తాయి.అంతెందుకు వాళ్లెవ్వరికీ ఛాన్స్ ఇవ్వకుండా అమీర్ ఖాన్ నిర్మాణ సంస్థనో..సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ హౌసో ముందుకొచ్చేస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు.