అమీర్‌ఖాన్ కుమార్తె ఇరా పెళ్లి తేది ఫిక్స్
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా కుమార్తె ఇరా ఖాన్ తన చిరకాల స్నేహితుడు నుపుర్ శిఖరేను జనవరిలో వివాహం చేసుకోబోతున్నారు
By: Tupaki Desk | 19 Dec 2023 7:01 PM GMTమిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా కుమార్తె ఇరా ఖాన్ తన చిరకాల స్నేహితుడు నుపుర్ శిఖరేను జనవరిలో వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవల ప్రేమపక్షులు తమ వివాహానికి ముందు ఉత్సవాలను ప్రారంభించగా తాజా అప్‌డేట్ ప్రకారం, అమీర్ - రీనా తమ బిడ్డ కోసం అత్యంత గ్రాండియర్ గా ఉండే లావిష్ వేడుకను ప్లాన్ చేసారు.
ఇప్పటికే వివాహ ఆహ్వాన పత్రిక కూడా ఆన్‌లైన్‌లో కనిపించింది. లవ్‌బర్డ్స్ ఇరా ఖాన్ -నూపూర్ శిఖరేలు నవంబర్ 2022లో నిశ్చితార్థం చేసుకున్నారు. 13 జనవరి 2024న పెళ్లి చేసుకోబోతున్నారు. జూమ్ టీవీ ప్రత్యేక నివేదిక ప్రకారం.. వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ముంబైలో జరిగే ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు మెజారిటీ భాగం హాజరుకానున్నారు. ఇరా తల్లిదండ్రులు అమీర్ - రీనా ఆనందంతో పరవశిస్తున్న సమయమిది. కుటుంబ సమేతంగా వివాహ సన్నాహాల్లో ఉన్నారని కూడా తెలుస్తోంది.
ఇరా ఖాన్ - నూపుర్ శిఖరేల వివాహ ఆహ్వానం ఆన్‌లైన్‌లో వచ్చాక అందరి దృష్టిని ఆకర్షించింది, ఇది క్లాసీ గా మినిమలిస్ట్ తో కనిపించింది. ఇది అధికారిక వివాహ ఆహ్వానమా కాదా అనేది పూర్తిగా తెలియదు కానీ బంగారం - నలుపు రంగు కాంబినేషన్ లో తెల్లటి థీమ్ కార్డ్ అందంగా కనిపించింది. కార్డ్‌పై సందేశం ఇలా ఉంది. ''మా పిల్లలు ఇరా & నూపూర్‌ల వివాహాన్ని జరుపుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానించడం మాకు చాలా ఆనందంగా ఉంది. దయచేసి ఈ జంటను ఆశీర్వదించడానికి మాతో చేరండి... జనవరి 13 శనివారం ఈ పెళ్లి జరగనుంది. ప్రీతమ్, రీనా, అమీర్‌లను ప్రేమించండి'' అని రాసారు.
ఇరా ఖాన్ మొదట్లో నూపూర్‌తో డేటింగ్ చేయకూడదనుకున్నానని వెల్లడించింది. ప్రారంభంలో మేము డేటింగ్ చేయకూడదని అనుకున్నాం. కానీ అంతలోనే అతడితో సంబంధం పెట్టుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే నా తలలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. దానిని ఎదుర్కోవాలనుకుంటున్నానా లేదా అనేది నాకు తెలియదు'' అని తెలిపింది. ''నేను చాలా కాలం పాటు ఆ ఆలోచన గురించి ముందుకు వెనుకకు ఊగాను. తరువాత అతడు పెద్దవాడని నేను గ్రహించాను. నేను అతడిని ఎందుకు అడగకూడదు? కాబట్టి అతడి వద్దకు వెళ్లి అడిగేసాను'' అని తెలిపింది.