అమీర్ ఖాన్ కూతురి పెళ్లి సందడి
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తన జిమ్ కోచ్ నూపుర్ షికారేని ప్రేమించి పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 Jan 2024 4:32 AM GMTబాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తన జిమ్ కోచ్ నూపుర్ షికారేని ప్రేమించి పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు (అమీర్, అతడి మొదటి భార్య రీనా) విడిపోవడంతో కొన్నేళ్ల పాటు డిప్రెషన్ లో ఉన్నానని చెప్పిన ఈ స్టార్ కిడ్ నూపుర్ ప్రేమతో ఎంతో సంతోషంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇరా-నుపుర్ జంట ఒకటయ్యేందుకు సమయమాసన్నమైంది. గత ఏడాది ఈ జంట నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే.
అమీర్ ఖాన్ ఇంట ఇప్పుడు పెళ్లి సందడి నెలకొంది. మంగళవారం నాడు జరిగిన హల్దీ వేడుకలో అమీర్ ఖాన్ కనిపించారు. ఈ నెల మొదటి వారంలో పెళ్లి జరుగుతుందని గతేడాది అమీర్ స్వయంగా వెల్లడించారు. ఇక ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈవెంట్లో అమీర్ సింపుల్ గా సాధారణ టీషర్ట్.. ధోతీ ప్యాంట్ లో కనిపించాడు. అమీర్ తల దువ్వకుండా గజిబిజిగా ఉన్న కేశాలంకరణ ఆశ్చర్యపరిచింది.
ఇరా ఖాన్ తన వివాహ వేడుకలను ప్రారంభించడానికి తన తండ్రి అమీర్ ఖాన్ ఇంటికి చేరుకున్న ఫోటోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించబోతున్నందున ఖాన్ కుటుంబం ఉప్పొంగిపోయింది. ఇరా -నుపూర్ జనవరి 3న బాంద్రాలోని ఖరీదైన తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్లో వివాహం చేసుకోనున్నారు. ఆ తర్వాత రెండు రిసెప్షన్ పార్టీలు జరుగుతాయి. ఒకటి ఢిల్లీలో.. మరొకటి జైపూర్లో జనవరి 6 - 10 మధ్య ఈ పార్టీలు ఉంటాయని తెలిసింది.
అమీర్ తన కుమార్తెకు వివాహం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడని జంటను ఆశీర్వదించడానికి పరిశ్రమలోని తన స్నేహితులు సహచరులను వ్యక్తిగతంగా ఆహ్వానించాడని కూడా తెలిసింది. సెలవు సీజన్ కారణంగా చాలా మంది తారలు నగరంలో లేరు. కానీ ఇది స్టార్-స్టడెడ్ వ్యవహారం అనడంలో సందేహం లేదు. పెళ్లికి రాలేని వారు జైపూర్లో రిసెప్షన్లో భాగం అవుతారు అని కూడా తెలుస్తోంది.
ముగ్గురు భార్యల కథేమిటి?
ఇరా పెళ్లి వేళ అమీర్ ఖాన్ ముగ్గురు భార్యల గురించి గుసగుస వినిపిస్తోంది. ఇరా ఖాన్ పెళ్లికి తన తల్లి రీనా దత్తా హాజరవుతారు.. కిరణ్ రావు వస్తారు. కానీ అమీర్ ఖాన్ అనధికారిక భార్య ఫాతిమ సనా షేక్ విచ్చేస్తుందా? అంటూ అభిమానుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఫాతిమా సనా షేక్ ఇంతకుముందు హల్దీకి హాజరయ్యారని హిందీ మీడియా పేర్కొంది.
అంతకుముందు అమీర్ మాజీ భార్యలు రీనా దత్తా - కిరణ్ రావు, నటి ఫాతిమా సనా షేక్, ఇమ్రాన్ ఖాన్ తదితరులు ఇరా ఖాన్ హల్దీ వేడుకలో కనిపించారు. రీనా మహారాష్ట్ర శైలిలో ఆకుపచ్చ చీరలో కనిపించగా, కిరణ్ కూడా చీరను ధరించారు. ఆమె సాంప్రదాయ మహారాష్ట్ర శైలిలో లావెండర్ చీరను ఎంచుకుంది. రేపు అంటే జనవరి 3న ఇరా నుపుర్ పెళ్లి చేసుకోబోతున్నారు.