అత్తమ్మ కోసం మాజీలిద్దరు వచ్చారే!
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం గురించి తెలిసిందే.
By: Tupaki Desk | 2 July 2024 11:33 AM GMTబాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం గురించి తెలిసిందే. మొదటి భార్య రీనా దత్తాతో విడిపోయిన తర్వాత గౌరీఖాన్ ని వివాహం చేసుకున్నారు. ఆ బంధం కూడా కొన్నాళ్లే కొనసాగింది. మనస్పర్ధల కారణంగా విడిపోయినా స్నేహితులుగా కలుస్తున్నారు. పిల్లల భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులుగా నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నింటిని దగ్గరుండి చూసుకుంటున్నారు.
ముఖ్యంగా కిరణ్ రావ్ తో అమీర్ బాండింగ్ మాత్రం విడిపోయినా ఎంతో గొప్పగా కొనసాగుతుంది. స్నేహితులుగా కలవడం, వెకేషన్లకు వెళ్లడం, పిల్లలతో సమయాన్ని గడపడం వంటివి జరుగుతున్నాయి. తాజాగా ఇటీవలే అమీర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ 90వ పుట్టిన రోజును ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. స్పెషల్ గా ఉండాలని అమీర్ ఎలాంటి లోటు రాకుండా దగ్గరుండి వేడుకలను నిర్వహించారు.
జీనత్ పాత స్నేహితులందర్నీ ఆహ్వానించి అమ్మకి ఓ గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోయేలా చేసారు.
జీనత్ స్నేహితుల్ని కలసుకుని ఎంతో సంతోష పడ్డారు. ఈ వేడుక అంతా ఓ ఆత్మీయ సమ్మేళనంలా జరిగింది. అంతా 85-90 మధ్యలో ఉన్న స్నేహితులు కావడం విశేషం. అలాగే అమీర్ ఖాన్ మాజీ భార్యలిద్దరు కూడా ఈ వేడుకలో భాగమయ్యారు. మాజీ అత్తకు విషెస్ తెలియజేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
అలాగే మనవలు కూడా హాజరయ్యారు. అంతా 90 ఏళ్ల భామ్మకు తమదైన శైలిలో విషెస్ తెలియజేసారు. మామ్ తో సమయాన్ని గడపడం అంటే అమీర్ కి ఎంతో ఇష్టం. కొంత కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమ్మతోనే అమీర్ కలిసి ఉంటున్నారు. మరి ఈ ఏడాది తన సినిమా విశేషాలేవైనా రివీల్ చేస్తారేమో చూడాలి.