అమీర్ ఖాన్ నికర ఆస్తుల విలువ?
ఖాన్‌ల త్రయంలో 6,300 కోట్ల ఆస్తులతో నంబర్ 1 స్థానంలో ఉన్నాడు కింగ్ ఖాన్ షారూఖ్. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ 2,850 కోట్లతో లీడ్ లో ఉన్నాడు
By: Tupaki Desk | 14 March 2024 10:30 AM GMTఖాన్‌ల త్రయంలో 6,300 కోట్ల ఆస్తులతో నంబర్ 1 స్థానంలో ఉన్నాడు కింగ్ ఖాన్ షారూఖ్. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ 2,850 కోట్లతో లీడ్ లో ఉన్నాడు. ఆ ఇద్దరితో పోలిస్తే అమీర్ ఖాన్ బాలీవుడ్ లో అత్యంత ధనవంతుడు కాకపోవచ్చు.. కానీ పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాల గ్రహీతగా అతడికి ఉన్న గౌరవం వేరు. అమీర్ ఖాన్ నికర విలువ రూ. 1862 కోట్లుగా ఉంది. అతడు తన సినిమాలు, నిర్మాణ సంస్థ, ఎండార్స్‌మెంట్‌లు, రియల్ ఎస్టేట్ , వ్యవస్థాపక పెట్టుబడులు సహా రకరకాల మార్గాల్లో తన ఆదాయాన్ని పొందుతాడు.
అమీర్ ఖాన్ కొన్ని సంవత్సరాలుగా నటన నుండి విరామం తీసుకున్నాడు. చివరిగా నటించిన లాల్ సింగ్ చద్దా కోసం అమీర్ ఖాన్ రూ. 50 కోట్లు తీసుకున్నాడు. కానీ సినిమా ఫ్లాపవ్వడంతో నష్టాలను భరించేందుకు అతడు సహకరించాడని సమాచారం.
అమీర్ ఖాన్‌కు చెందిన 5 అత్యంత ఖరీదైన ఆస్తులేవి? అన్న వివరాల్లోకి వెళితే... అమీర్ ఖాన్ బెవర్లీ హిల్స్‌లో ఒక ఖరీదైన ఇంటిని కలిగి ఉన్నాడు. దీని ధర రూ. 75 కోట్లు. లాస్ ఏంజెల్స్ లోని బెవర్లీ హిల్స్ ఒక అధునాతన హాట్‌స్పాట్. చాలా మంది హాలీవుడ్ ప్రముఖులు ఇక్కడ నివసిస్తారు. విలాసవంతమైన LA శివారు ప్రాంతంలో పెట్టుబడులు పెట్టిన బాలీవుడ్ నటులలో అమీర్ ఖాన్ కూడా ఉన్నారు.
అమీర్ ఖాన్ బాంద్రా ఇంటి ఖరీదు 60 కోట్లు. 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తులతో విస్తరించి ఉన్న సముద్రానికి ఎదురుగా ఉన్న విశాలమైన బాంద్రా నివాసంలో అతడు నివసిస్తున్నారు. అందులో ఒక అంతస్తును అమీర్ ఖాన్ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. అమీర్ ఖాన్ తన కుటుంబం సహా తరచుగా నగర ఔటర్‌లోని విశాలమైన పంచగని ఫామ్‌హౌస్‌లో తమ సమయాన్ని వెచ్చిస్తారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రాజభవనాన్ని అమీర్ 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
అమీర్ ఖాన్ లగ్జరీ కార్లకు పెద్ద అభిమాని. ఖరీదైన కార్లను అతడు కలిగి ఉన్నాడు. కార్‌బైక్ఇండియా వివరాల ప్రకారం.. అతడి అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి మెర్సిడెస్-బెంజ్ S600. దీని ధర రూ. 10.50 కోట్లు. అమీర్ ఖాన్ కార్లలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఖరీదైనది. ఇది బాలీవుడ్ ప్రముఖులకు ఇష్టమైనది. కార్‌దేఖో ప్రకారం.. ఈ లగ్జరీ కారు ధర రూ.6.95 కోట్ల నుండి రూ.7.95 కోట్ల మధ్య ఉంటుంది. అమీర్ సొంతంగా సినిమాల నిర్మాణ సంస్థను కలిగి ఉన్నాడు. (14 మార్చి అమీర్ ఖాన్ బర్త్ డే సందర్భంగా ఈ స్పెషల్)