మూడవ పెళ్లి విషయంలో అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం!
బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ వివాహా జీవితం గురించి తెలిసిందే.
By: Tupaki Desk | 26 Aug 2024 9:50 AM GMTబాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ వివాహా జీవితం గురించి తెలిసిందే. ఆయన మొదటి వివాహం రీనా దత్తాని పెళ్లి చేసుకున్నారు. ఆ జోడీకి పిల్లలున్నారు. ఆ తర్వాత కొంత కాలానికి మనస్పర్దలు కారణంగా విడిపోయారు. అటుపై తాను డైరెక్ట్ చేసిన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కిరణ్ రావ్ ని ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నారు. కానీ ఆ బంధం ఎంతో కాలం నివవలేదు.
కలిసి ఉండలేమని భావించిన ఇద్దరు విడాకులతో వేరయ్యారు. అలా అమీర్ ఖాన్ కి రెండు వివాహాలు కలిసి రాలేదు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూ లో వివాహ బంధం సక్సెస్ కావాలంటే ఏంచేయాలి? అనే ప్రశ్న ఎదురైంది. దానికి అమీర్ ఇలా స్పందించారు. `వైవాహిక జీవితానికి సంబంధించి నేను రెండుసార్లు ఫెయిలయ్యాను. కాబట్టి పెళ్లి విషయంలో నా సూచనలు తీసుకోకపోవడం మంచిది.
నాకు ఒంటరిగా జీవించడం ఇష్టం ఉండదు. నాకంటూ ఓ భాగస్వామి ఉండాలని కోరుకుంటా. ఒకరితో కలిసి ఉండటం..ఇష్టాలు..కష్టాలు పంచుకోవడం నాకు ఇష్టం. నా మాజీలిద్దరితో నాకెంతో మంచి అనుబంధం ఉంది. నాదృష్టిలో మేమంతా ఒకే కుటుంబం. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. కాబట్టి వైవాహిక బంధం సక్సస్ అవుతుందా? లేదా?అన్నది మనం ఎలా చెప్పగలం` అన్నారు.
అలాగే మూడవ పెళ్లి చేసుకుంటారా అంటే?. ` నా వయసు 59 ఏళ్లు. నాకు మళ్లీ ఇప్పుడు పెళ్లి అంటే చాలా కష్టం. ప్రస్తుతం నాకెన్నో బాధ్యతలున్నాయి. నా కుటుంబం, పిల్లలు, స్నేహితులతో కనెక్ట్ అయ్యా. వారితో సంతోషంగా సమయాన్ని ఆస్వాదిస్తున్నా. అందుకు చాలా ఆనందంగా ఉంది. నన్ను నేను మరింత ఉన్నతంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా` అని అన్నారు.