Begin typing your search above and press return to search.

ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్.. పెళ్లి కోసం నరేష్ అల్లరి ఆవేదన..

కామెడీ కింగ్ అల్లరి నరేష్ చాలా కాలం తరువాత మళ్ళీ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు

By:  Tupaki Desk   |   22 April 2024 12:16 PM GMT
ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్.. పెళ్లి కోసం నరేష్ అల్లరి ఆవేదన..
X

కామెడీ కింగ్ అల్లరి నరేష్ చాలా కాలం తరువాత మళ్ళీ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న అల్లరి నరేష్ న్యూ మూవీ 'ఆ ఒక్కటి అడక్కు'. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ ను నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల చేశారు.

కథానాయకుడు నరేష్ ఈసారి పెళ్లి కాని యువకుడిగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం యువత ఎదుర్కొనే సమస్యనే కామెడీగా హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కథానాయకుడు కుల భావన లేకపోయినా ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఇక 49 సార్లు రిజెక్ట్ కావడంతో చివరికి మ్యారేజ్ బ్యూరోని సంప్రదిస్తాడు. అనంతరం అతను ఫరియా అబ్దుల్లాతో ప్రేమలో పడతాడు.

అయితే ఆ అమ్మాయితో హీరో ప్రేమ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ తరం యువతకు పెళ్లి పెద్ద సమస్య కావడంతో దర్శకుడు ఈ అంశాన్ని ఎంచుకుని వినోదాత్మకంగా చెప్పాడు. కామెడీ సీక్వెన్స్‌ లలో అల్లరి నరేష్ ఎప్పటిలాగే బెస్ట్ అనిపించాడు. అతని కామిక్ టైమింగ్ తో పాటు.. ఫరియా అబ్దుల్లా పంచ్ లు సినిమాలో హైలెట్ కాబోతున్నట్లు చూపించారు.

వెన్నెల కిషోర్, షకలక శంకర్, వైవా హర్ష వంటి వారు కూడా సినిమాలో మంచి కామెడీ టైమింగ్ ఉన్న పాత్రలు చేసినట్లు అనిపిస్తుంది. అలాగే అల్లరి నరేష్ ఈ సినిమాలో కాస్త ఆవేశంతో కూడిన యాక్షన్ ని కూడా హైలెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కామెడీ లవ్ అలాగే ట్విస్ట్ లాంటి అంశాలతో పాటు సినిమాలో ఒక సీరియస్ పాయింట్ కూడా ఉండబోతున్నట్లుగా చూపించారు.

ఇక ట్రైలర్ చివర బంధువుల వలన ఇబ్బంది పడే యువకులకు నచ్చే విధంగా అల్లరి నరేష్ చెప్పిన డైలాగ్ మరింత హైలెట్ అయ్యింది. ఇక సినిమాకు సూర్య కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది, గోపీ సుందర్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ కు సరైన మూడ్‌ ని సెట్ చేశాడు. ఇక ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు.

టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి AP మరియు తెలంగాణ ఆ ఒక్కటి అడక్కు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. ఇక రెండు మే 3న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. చాలా రోజుల తరువాత నరేష్ నుంచి వస్తున్న కామెడీ సినిమా కావడంతో తప్పకుండా హిట్ అవుతుంది అని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.