ఆరాధ్యకి హెయిర్ స్టైల్ తెచ్చిన తంట!
ఐశ్వర్యారాయ్-అభిషేక్ బచ్చన్ ల గారాల పట్టి ఆరాధ్య గురించి చెప్పాల్సిన పనిలేదు
By: Tupaki Desk | 6 March 2024 9:49 AM GMTఐశ్వర్యారాయ్-అభిషేక్ బచ్చన్ ల గారాల పట్టి ఆరాధ్య గురించి చెప్పాల్సిన పనిలేదు. తల్లిదండ్రుల వారసత్వాన్ని ఇండస్ట్రీలో కొనసాగిస్తుందా? మరో రంగం వైపు వెళ్తుందా? అన్నది తెలియదు గానీ హీరో యిన్ అయితే గనుక ఇండస్ట్రీని మామ్ లా ఓ ఊపే ఊపేస్తుంది అన్నది మాత్రం వాస్తవం. తాజాగా ఆరాధ్య కొత్త ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరైన ఆరాధ్య న్యూలుక్ ఇప్పుడు నెట్టింట కాక పుట్టిస్తుంది.
వివరాల్లోకి వెళ్తే ఆరాధ్య వయసు 12 ఏళ్లు అయినా... ఆమె లుక్ మాత్రం హీరోయిన్ నే తలపిస్తుంది. ఆలుక్ చూసిన వారంతా అప్పుడే ఆరాధ్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేస్తుందా? అన్న సందేహం రాక మానదు. ఆ సంగతి పక్కనబెడితే ఆరాధ్య ఎప్పుడు కనిపించినా ఒకే స్టైల్ లుక్ లో కనిపిస్తుంది. హెయిర్ ముందుకు కట్ చేయించి పాపాయిలా కనిపిస్తుంది. కానీ మొన్నటి అంబానే ఇంట వేడుకలో ఆరాధ్య లుక్ పూర్తిగా మార్చేసింది.
పాత లుక్ కి తాత్కాలికంగా గుడ్ బై చెప్పిందా? వేడుక కోసం స్పెషల్ గా ఉండాలని ఆ రోజు మాత్రమే అలా ముస్తాబైందా? అన్నది తెలియదు గానీ ఐశ్వర్యారాయ్ న్యూ హెయిర్ స్టైల్ కి అంతా ఫిదా అవుతున్నారు. ఆ లుక్ ఎన్నో సందేహాలకు తావిస్తుంది. ఆరాధ్య రూప లావణ్యం కోసం అవసరమైన శస్త్ర చికిత్సలు చేయించుకుందని...అవసరం మేర ప్లాస్టిక్ సర్జరీలకు వెళ్లిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. వాటి ద్వారానే ఆరాధ్యలో అన్ని రకాల మార్పులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
అయితే మరికొంత మంది కేవలం హెయిర్ స్టైల్...మ్యాకప్ స్టైల్ మార్చడం వల్లే అలా కొత్తగా కనిపిస్తుం దని..ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని అభిప్రాయపడుతున్నారు. మరి ఆరాధ్య సర్జరీ వరకూ వెళ్లిం దా? లేక నేచురల్ లుక్ తోనే అంత అందంగా కనిపిస్తుందా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.
అయితే ఆరాధ్యపై ఈ రకమైన ప్రచారం ఈ మధ్య కాలంలో పరాకాష్టకు చేరుతున్నట్లే కనిపిస్తుంది. ఆరాధ్య ఇంకా మైనర్. ఆమె వయసు 12 సంవత్సరాల మూడు నెలలు. 18సంత్సరాలు నిండక ముందే ఈ రకమైన స్పెక్యులేషన్స్ అనేవి ఈ మధ్య కాలంలో తారా స్థాయికి చేరుతున్నాయి. ఫ్యాన్ మేడ్ పోస్టర్లలో ఆరాధ్య వయసు రెట్టింపు కనిపిస్తుంది. అవి చూసి ఆరాధ్య అప్పుడే అంత పెద్దదైపోయిందా? అన్న టాపిక్ చర్చకొస్తుంది. అయితే ఇలాంటి వాటిని ఖండించే ప్రయత్నాలు కూడా కుటుంబం వైపు నుంచి కనిపిం చడం లేదు.